Savadi suttarigaalu jagadilom galavaa

సవతి చుట్టరికాలు జగతిలోఁ గలవా
Language

(॥పల్లవి॥)
సవతి చుట్టరికాలు జగతిలోఁ గలవా
వివరించుకొంటగాక వినయా లింకానా

(॥సవ॥)
వద్దు వద్దు వాదులు వలవనిపోదులు
యిద్దరి జాడలు గంటి మింకానేలే
అద్దో నీ వేమి సేతు వాతనివల్లనే కాక
కొద్దిమాలి నే నీతోఁ గొసరే దింకానా

(॥సవ॥)
కాతరపుటానలు కడుఁబచ్చిమేనులు
యీతనికి నీకె తగు నింకానేలే
వోతరుణి యేసినవాఁడుండఁగ నమ్మేమిసేయ
తోతో నీకును నాకు దొమ్ము లింకానా

(॥సవ॥)
చాలుఁజాలు బాసలు చక్కనాయ రేసులు
యీలకూరల కుప్పు చాల దివి యింకానా
ఆలరి శ్రీ వేంకటేశుఁ డంతలోనె నన్నుఁ గూడె
వాలుకరెప్పలు నీపె వంచె దింకానా

(||pallavi||)
savadi suṭṭarigālu jagadilom̐ galavā
vivariṁchugŏṁṭagāga vinayā liṁkānā

(||sava||)
vaddu vaddu vādulu valavanibodulu
yiddari jāḍalu gaṁṭi miṁkānele
addo nī vemi sedu vādanivallane kāga
kŏddimāli ne nīdom̐ gŏsare diṁkānā

(||sava||)
kādarabuḍānalu kaḍum̐bachchimenulu
yīdanigi nīgĕ tagu niṁkānele
vodaruṇi yesinavām̐ḍuṁḍam̐ga nammemiseya
todo nīgunu nāgu dŏmmu liṁkānā

(||sava||)
sālum̐jālu bāsalu sakkanāya resulu
yīlagūrala kuppu sāla divi yiṁkānā
ālari śhrī veṁkaḍeśhum̐ ḍaṁtalonĕ nannum̐ gūḍĕ
vālugarĕppalu nībĕ vaṁchĕ diṁkānā