సవతైనా నాపె మేలు సరి నీకంటె
(॥పల్లవి॥)
సవతైనా నాపె మేలు సరి నీకంటె
అవల నాపె చెప్పిన అట్టె సేయవయ్యా
(॥సవతైనా॥)
యేపున నన్ను మన్నించి యేమి సేయవలసిన-
నాపెనే యేకతమున నడుగవయ్యా
దాపుగ నాఁడుజాతికి దయగల దెప్పుడును
మాపుదాఁకా మగవాఁడు మత్తుడే యెంచఁగను
(॥సవతైనా॥)
నేరుపున నీవు నాతో నెత్తమాడవలసిన
కోరి యాపె నొద్దఁ బెట్టుకొనవయ్యా
అరితేరినాఁడు వారి కాఁడువారే తోడునీడ
గారవపు మగవాఁడు కపటే యెపుడు
(॥సవతైనా॥)
శ్రీవేంకటేశ్వర నన్నుఁ జేకొని కూడితి విట్టె
యేవేళ నలమేల్మంగ కియ్యకోలయ్యా
కైవశమై ఆఁడువారు కనిపించేయట్టివారు
వాపులనే మగవారు వంతువా నెఱఁగరు
(||pallavi||)
savadainā nābĕ melu sari nīgaṁṭĕ
avala nābĕ sĕppina aṭṭĕ seyavayyā
(||savadainā||)
yebuna nannu manniṁchi yemi seyavalasina-
nābĕne yegadamuna naḍugavayyā
dābuga nām̐ḍujādigi dayagala dĕppuḍunu
mābudām̐kā magavām̐ḍu mattuḍe yĕṁcham̐ganu
(||savadainā||)
nerubuna nīvu nādo nĕttamāḍavalasina
kori yābĕ nŏddam̐ bĕṭṭugŏnavayyā
ariderinām̐ḍu vāri kām̐ḍuvāre toḍunīḍa
gāravabu magavām̐ḍu kabaḍe yĕbuḍu
(||savadainā||)
śhrīveṁkaḍeśhvara nannum̐ jegŏni kūḍidi viṭṭĕ
yeveḽa nalamelmaṁga kiyyagolayyā
kaivaśhamai ām̐ḍuvāru kanibiṁcheyaṭṭivāru
vābulane magavāru vaṁtuvā nĕṟam̐garu