Sarvobaayamula jagadi naagidamde

సర్వోపాయముల జగతి నాకితఁడే
Language

(॥పల్లవి॥)
సర్వోపాయముల జగతి నాకితఁడే
వుర్వీధరుఁడు పురుషోత్తముం డితఁడే

(॥సర్వో॥)
సకలగంగాది తీర్థస్నానఫలము లివి స్వామిపుష్కరణి జలమే నాకు
సకలపుణ్యక్షేత్రావాసయాత్ర లివి సరి వేంకటాచలవిహార మిదియే
సకలవేదాధ్యయనశాస్త్రపాఠంబు లివి శౌరిసంకీర్తనం బిదియే నాకు
సకలకర్మానుష్ఠానముల యితని కిచ్చటఁ జాతుపడి కైంకర్య మిదియే

(॥సర్వో॥)
ఉపవాసతపములివి యితని ప్రసాదంబులొగి భుజింపుటే నాదు దినదినంబు
జపరహస్యోపదేశంబు లితనిపాదజలంబులు శరణనేటి సేవ యొకటే
ఉపమింపఁ బుణ్యపురుషుల దర్శనము నాకు నొగి నిచటి బహువృక్షదర్శనంబు
యెపుడుఁ బుణ్యకథాశ్రవణంబు లిచ్చోటి యెన్నఁగల బహుపక్షికలకలంబు

(॥సర్వో॥)
తలఁపుగల యోగంబులందు శ్రీవైష్ణవులఁ దగులు సంవాససహయోగంబు
వెలయ నిండుమహోత్సవంబులిన్నియు నితనివిభవంబులెసఁగు తిరునాళ్ళు నాకు
చెలఁగి యిటు దేవతాప్రార్థనింతయు నాకు శ్రీవేంకటేశ్వరుని శరణాగతి
అలరు నాసంపదలు యితని పట్టపురాణి అలమేలుమంగ కడకంటిచూపు

(||pallavi||)
sarvobāyamula jagadi nāgidam̐ḍe
vurvīdharum̐ḍu puruṣhottamuṁ ḍidam̐ḍe

(||sarvo||)
sagalagaṁgādi tīrdhasnānaphalamu livi svāmibuṣhkaraṇi jalame nāgu
sagalabuṇyakṣhetrāvāsayātra livi sari veṁkaḍāsalavihāra midiye
sagalavedādhyayanaśhāstrabāṭhaṁbu livi śhaurisaṁkīrdanaṁ bidiye nāgu
sagalagarmānuṣhṭhānamula yidani kichchaḍam̐ jādubaḍi kaiṁkarya midiye

(||sarvo||)
ubavāsadabamulivi yidani prasādaṁbulŏgi bhujiṁpuḍe nādu dinadinaṁbu
jabarahasyobadeśhaṁbu lidanibādajalaṁbulu śharaṇaneḍi seva yŏgaḍe
ubamiṁpam̐ buṇyaburuṣhula darśhanamu nāgu nŏgi nisaḍi bahuvṛkṣhadarśhanaṁbu
yĕbuḍum̐ buṇyagathāśhravaṇaṁbu lichchoḍi yĕnnam̐gala bahubakṣhigalagalaṁbu

(||sarvo||)
talam̐pugala yogaṁbulaṁdu śhrīvaiṣhṇavulam̐ dagulu saṁvāsasahayogaṁbu
vĕlaya niṁḍumahotsavaṁbulinniyu nidanivibhavaṁbulĕsam̐gu tirunāḽḽu nāgu
sĕlam̐gi yiḍu devadāprārdhaniṁtayu nāgu śhrīveṁkaḍeśhvaruni śharaṇāgadi
alaru nāsaṁpadalu yidani paṭṭaburāṇi alamelumaṁga kaḍagaṁṭisūbu