Sarveshvarumdavu svadamtrumdavu neevu

సర్వేశ్వరుఁడవు స్వతంత్రుఁడవు నీవు
Language

(॥పల్లవి॥)
సర్వేశ్వరుఁడవు స్వతంత్రుఁడవు నీవు
సర్వోత్తముఁడ న న్నిచ్చటఁ గావవే

(॥సర్వే॥)
శక్తి కలిగితే నీ సరుస దేవుఁడఁగానా
యుక్తి కలిగితే నే నొడలు మోతునా
యుక్తియు శక్తియు నొకటి లేక నీ
భక్తుఁడ నైతి నన్నుఁ బాలించవే

(॥సర్వే॥)
బహు పుణ్యుఁడ నైతే బ్రహ్మపట్ల మేలనా
సహజవిజ్ఞాని నైతే సంసారీ నౌదునా
విహితపుణ్యజ్ఞాన విముఖుఁడఁ గనకనే
నహిశయనుఁడ శరణంటిఁ గావవే

(॥సర్వే॥)
శ్రీ వేంకటేశ నీవు చేసిన ప్రతిమ నింతే
నీ వెఱుఁగనిది లేదు నేరుపు నా యందు నీదే
భావము లోపల నీవే పైకొని బుద్ధి యియ్యఁగా
నీవాఁడ ననుకొంటి నేఁడు గావవే

(||pallavi||)
sarveśhvarum̐ḍavu svadaṁtrum̐ḍavu nīvu
sarvottamum̐ḍa na nnichchaḍam̐ gāvave

(||sarve||)
śhakti kaligide nī sarusa devum̐ḍam̐gānā
yukti kaligide ne nŏḍalu modunā
yuktiyu śhaktiyu nŏgaḍi lega nī
bhaktum̐ḍa naidi nannum̐ bāliṁchave

(||sarve||)
bahu puṇyum̐ḍa naide brahmabaṭla melanā
sahajavijñāni naide saṁsārī naudunā
vihidabuṇyajñāna vimukhum̐ḍam̐ ganagane
nahiśhayanum̐ḍa śharaṇaṁṭim̐ gāvave

(||sarve||)
śhrī veṁkaḍeśha nīvu sesina pradima niṁte
nī vĕṟum̐ganidi ledu nerubu nā yaṁdu nīde
bhāvamu lobala nīve paigŏni buddhi yiyyam̐gā
nīvām̐ḍa nanugŏṁṭi nem̐ḍu gāvave