సర్వేశ్వరా నీతో సరి యెవ్వరు
(॥పల్లవి॥)
సర్వేశ్వరా నీతో సరి యెవ్వరు
పూర్వపువారు చెప్పఁగాఁ బూఁచి కొలిచేఁ గాని
(॥సర్వే॥)
చేరి వేదములు నిన్నుఁ జెప్పఁగా వినుటే కాని
నీరూపము దర్శించేవార లెవ్వరు
ధారుణిలో నీయవతారాలే చూచుట
ధీరత నీమహిమలు తెలిసేవా రెవ్వరు
(॥సర్వే॥)
భూమివారిఁ జూచి నిన్నుఁ బూజలు సేయుట గాని
కామించి నీతో మాటాడే ఘను లెవ్వరు
దీమసాన నీ దాసుల ద్రిష్ట మెరుగుట గాని
యీమేర నీ దైవిక మెరిగే వా రెవ్వరు
(॥సర్వే॥)
వరములు నీ వియ్యఁగా వచ్చి సేవించుట గాని
కెరలి నీమూర్తి వెదకేవా రెవ్వరు
హరి శ్రీవేంకటేశా నీకరుణవారౌట గాని
అరసి నిన్ను సుద్దులడిగేవా రెవ్వరు
(||pallavi||)
sarveśhvarā nīdo sari yĕvvaru
pūrvabuvāru sĕppam̐gām̐ būm̐si kŏlisem̐ gāni
(||sarve||)
seri vedamulu ninnum̐ jĕppam̐gā vinuḍe kāni
nīrūbamu darśhiṁchevāra lĕvvaru
dhāruṇilo nīyavadārāle sūsuḍa
dhīrada nīmahimalu tĕlisevā rĕvvaru
(||sarve||)
bhūmivārim̐ jūsi ninnum̐ būjalu seyuḍa gāni
kāmiṁchi nīdo māḍāḍe ghanu lĕvvaru
dīmasāna nī dāsula driṣhṭa mĕruguḍa gāni
yīmera nī daiviga mĕrige vā rĕvvaru
(||sarve||)
varamulu nī viyyam̐gā vachchi seviṁchuḍa gāni
kĕrali nīmūrdi vĕdagevā rĕvvaru
hari śhrīveṁkaḍeśhā nīgaruṇavārauḍa gāni
arasi ninnu suddulaḍigevā rĕvvaru