Sarvashaktivi neeve sagalalogeshvaraa

సర్వశక్తివి నీవే సకలలోకేశ్వరా
Language

(॥పల్లవి॥)
సర్వశక్తివి నీవే సకలలోకేశ్వరా
నిర్వహించి నన్ను రక్షించఁగ నీవే

(॥సర్వ॥)
తండ్రిపైఁ జేసిన భక్తి దైవమా నీకే శెలవు
తండ్రికి తండ్రివి నీ వంతర్యామివి
మండ్రాడి తల్లిపైఁ జేసే మచ్చి కెల్లా నీది
నిండ్రుఁ దల్లిలో వాఁడవు నీవె కనక

(॥సర్వ॥)
పెండ్లాముపై జేసిను ప్రేమ లెల్లా నీ సొమ్మే
పెండ్లాములో భావన నీ పెంపే కనక
వెండ్లకై బంగారులకై వెలసే తపసు నీదె
యిండ్లిండ సంపదలు నీ వింతాఁ గనక

(॥సర్వ॥)
కిమ్ముల దేహానకు భోగించిన బోగము నీదె
నెమ్మది నంతర్యామివి నీవు గనక
యిమ్ముల శ్రీ వేంకటేశ యిన్నియు విన్నవించితి
కమ్మి నా కన్నిటికీ కర్తవు నీవే కాన

(||pallavi||)
sarvaśhaktivi nīve sagalalogeśhvarā
nirvahiṁchi nannu rakṣhiṁcham̐ga nīve

(||sarva||)
taṁḍribaim̐ jesina bhakti daivamā nīge śhĕlavu
taṁḍrigi taṁḍrivi nī vaṁtaryāmivi
maṁḍrāḍi tallibaim̐ jese machchi kĕllā nīdi
niṁḍrum̐ dallilo vām̐ḍavu nīvĕ kanaga

(||sarva||)
pĕṁḍlāmubai jesinu prema lĕllā nī sŏmme
pĕṁḍlāmulo bhāvana nī pĕṁpe kanaga
vĕṁḍlagai baṁgārulagai vĕlase tabasu nīdĕ
yiṁḍliṁḍa saṁpadalu nī viṁtām̐ ganaga

(||sarva||)
kimmula dehānagu bhogiṁchina bogamu nīdĕ
nĕmmadi naṁtaryāmivi nīvu ganaga
yimmula śhrī veṁkaḍeśha yinniyu vinnaviṁchidi
kammi nā kanniḍigī kardavu nīve kāna