సర్వశబ్దవాచ్యుఁడవు సర్వేశ యిన్నిటా నీవే
(॥పల్లవి॥)
సర్వశబ్దవాచ్యుఁడవు సర్వేశ యిన్నిటా నీవే
పూర్వమందునుండి క్రతుభోక్తవు నీవే
(॥సర్వ॥)
వెస వరుణునిఁ గూర్చి వేలుతు రాహుతులు
వసుధలోపలి విప్రవరు లెల్లాను
యెసగ నావరుణుఁడు యెవ్వరిఁగూర్చి వేల్చు
మసలక తానే మంత్రము లుచ్చరించు
(॥సర్వ॥)
యెందైనాఁ గ్రతువులు యింద్రునిఁగూర్చి సేతురు
పొందుగ నానాద్విజపుంగవు లెల్లా
చెంది యెవ్వరిఁగూరిచి సేయుఁ గ్రతువు లింద్రుఁడు
మందలించి తానే మంత్రములు నొడువు
(॥సర్వ॥)
భూమిసుర లెజ్ఞములు పూని సేయుదురు బ్రహ్మ
కేమంత్రాలఁ జేయు నతఁ డెవ్వరిఁగూర్చి
శ్రీమంతుఁడవై నయట్టి శ్రీవేంకటేశఁడ నీవే
నామమునఁ దొల్లే యజ్ఞనారాయణుఁడవు
(||pallavi||)
sarvaśhabdavāchyum̐ḍavu sarveśha yinniḍā nīve
pūrvamaṁdunuṁḍi kradubhoktavu nīve
(||sarva||)
vĕsa varuṇunim̐ gūrsi veludu rāhudulu
vasudhalobali vipravaru lĕllānu
yĕsaga nāvaruṇum̐ḍu yĕvvarim̐gūrsi velsu
masalaga tāne maṁtramu luchchariṁchu
(||sarva||)
yĕṁdainām̐ graduvulu yiṁdrunim̐gūrsi seduru
pŏṁduga nānādvijabuṁgavu lĕllā
sĕṁdi yĕvvarim̐gūrisi seyum̐ graduvu liṁdrum̐ḍu
maṁdaliṁchi tāne maṁtramulu nŏḍuvu
(||sarva||)
bhūmisura lĕjñamulu pūni seyuduru brahma
kemaṁtrālam̐ jeyu nadam̐ ḍĕvvarim̐gūrsi
śhrīmaṁtum̐ḍavai nayaṭṭi śhrīveṁkaḍeśham̐ḍa nīve
nāmamunam̐ dŏlle yajñanārāyaṇum̐ḍavu