సరుసఁ గూచుండవే సరసములాడవే
(॥పల్లవి॥)
సరుసఁ గూచుండవే సరసములాడవే
శిరసు వంచుకోనేల చిన్నదానవటవే
(॥రు॥)
పలుకుతనై తేను పచ్చికప్పురాలు రాలీ
తిలకించితే మోవిఁ దేనె చిందీని
చెలువుఁడు చెనకితే సిగ్గుతోడఁ బెనఁగేవు
చెలియరో నీవింకాఁ జిన్నదానవటవే
(॥రు॥)
మొలకనవ్వులనైతే ముత్యాలు వొడమీని
నిలువు నూరు వండీవి నీమురిపేలు
బలిమిఁ జన్నులంటితే పయ్యద కొంగు మూసేవు
చిలుకరాదా వలపు చిన్నదానవటవే
(॥రు॥)
సందడిచూపలనైతే చల్లఁగా వెన్నెలగాసీ
కందువ నెమ్మోమునఁ గళ లుబ్బీవి
అందపు శ్రీవేంకటేశు నలమేల్‌మంగవు నీవు
చెంది మరీఁ గొసరేవు చిన్నదానవటవే
(||pallavi||)
sarusam̐ gūsuṁḍave sarasamulāḍave
śhirasu vaṁchugonela sinnadānavaḍave
(||ru||)
palugudanai tenu pachchigappurālu rālī
tilagiṁchide movim̐ denĕ siṁdīni
sĕluvum̐ḍu sĕnagide siggudoḍam̐ bĕnam̐gevu
sĕliyaro nīviṁkām̐ jinnadānavaḍave
(||ru||)
mŏlaganavvulanaide mutyālu vŏḍamīni
niluvu nūru vaṁḍīvi nīmuribelu
balimim̐ jannulaṁṭide payyada kŏṁgu mūsevu
silugarādā valabu sinnadānavaḍave
(||ru||)
saṁdaḍisūbalanaide sallam̐gā vĕnnĕlagāsī
kaṁduva nĕmmomunam̐ gaḽa lubbīvi
aṁdabu śhrīveṁkaḍeśhu nalamelmaṁgavu nīvu
sĕṁdi marīm̐ gŏsarevu sinnadānavaḍave