Sarusa dishamulagu saagi relaraa

సరుస దిషములకు సాకి రేలరా
Language

(॥పల్లవి॥)
సరుస దిషములకు సాకి రేలరా
మరుతంత్రములలోన మఱుఁగులు గలవా

(॥సరుస॥)
యేకతాన ఆకె నిన్ను నిద్దరినేఁ బొడగంటి
నాకు చుట్టి యిచ్చె నింతే యని బొంకేవు
మేకొని పువ్వులలోన మెదలే తుమ్మెదదా
నాకడఁ బరిమళము లంట నంటే నిజమా

(॥సరుస॥)
యీదె మంచముమీఁద ఇంతి నీకు యాడ దంటే
పాద మొత్తేచెలి యంటా బాస సేసేవు
పోదితోడ గుంపు మాని పొంత నున్న పూవుఁ దీగె
ఆదిగొని కొమ్మ గొమ్మ నలమక వుండునా

(॥సరుస॥)
వురముపైని కొమ్మ వున్న దిది యాడ దంటే
గరిమ బంగారులో సింగార మనేవు
నిరతి శ్రీవేంకటేశ నీకు భూమిదేవి నేను
దొరసితి నిందిరయు తోడు నీకు వలెఁగా

(||pallavi||)
sarusa diṣhamulagu sāgi relarā
marudaṁtramulalona maṟum̐gulu galavā

(||sarusa||)
yegadāna āgĕ ninnu niddarinem̐ bŏḍagaṁṭi
nāgu suṭṭi yichchĕ niṁte yani bŏṁkevu
megŏni puvvulalona mĕdale tummĕdadā
nāgaḍam̐ barimaḽamu laṁṭa naṁṭe nijamā

(||sarusa||)
yīdĕ maṁchamumīm̐da iṁti nīgu yāḍa daṁṭe
pāda mŏttesĕli yaṁṭā bāsa sesevu
podidoḍa guṁpu māni pŏṁta nunna pūvum̐ dīgĕ
ādigŏni kŏmma gŏmma nalamaga vuṁḍunā

(||sarusa||)
vuramubaini kŏmma vunna didi yāḍa daṁṭe
garima baṁgārulo siṁgāra manevu
niradi śhrīveṁkaḍeśha nīgu bhūmidevi nenu
dŏrasidi niṁdirayu toḍu nīgu valĕm̐gā