Sarivaaramaa needo sarasamulaadamgaa

సరివారమా నీతో సరసములాడఁగా
Language

(॥పల్లవి॥)
సరివారమా నీతో సరసములాడఁగా
నెరవాదివై మమ్ము నీవేల రేఁచేవు

(॥సరి॥)
నగితేనే కాదా నాఁటుక వెంగేలయ్యేది
తగులనాడితేఁ గాదా తప్పు లయ్యేది
వెగటు లింతేసికి వెఱతుమయ్య నేము
వొగి నీమేమనినాను వోరుచుకుండేము

(॥సరి॥)
ముందర నుండితేఁగాదా మొగచాట్లయ్యేది
కందువ లంటితేఁగాదా ఘాతలయ్యేది
విందువెట్టి పగలకు వెరతుమయ్య నేము
ఇందరివలెనే నీకు నిచ్చక మాడేము

(॥సరి॥)
సన్నలు సేసితేఁగాదా చలములు పుట్టేది
కన్నులఁ జూచితేకాదా కాఁక వుట్టేది
యెన్నికతో శ్రీవేంకటేశ నీకు వెఱతుము
మన్నించి కూడితివి నీమఱఁగుఁ జొచ్చేము

(||pallavi||)
sarivāramā nīdo sarasamulāḍam̐gā
nĕravādivai mammu nīvela rem̐sevu

(||sari||)
nagidene kādā nām̐ṭuga vĕṁgelayyedi
tagulanāḍidem̐ gādā tappu layyedi
vĕgaḍu liṁtesigi vĕṟadumayya nemu
vŏgi nīmemaninānu vorusuguṁḍemu

(||sari||)
muṁdara nuṁḍidem̐gādā mŏgasāṭlayyedi
kaṁduva laṁṭidem̐gādā ghādalayyedi
viṁduvĕṭṭi pagalagu vĕradumayya nemu
iṁdarivalĕne nīgu nichchaga māḍemu

(||sari||)
sannalu sesidem̐gādā salamulu puṭṭedi
kannulam̐ jūsidegādā kām̐ka vuṭṭedi
yĕnnigado śhrīveṁkaḍeśha nīgu vĕṟadumu
manniṁchi kūḍidivi nīmaṟam̐gum̐ jŏchchemu