Sarimohaa liddarigi saadigim benamgam jochche

సరిమోహా లిద్దరికి సాటికిఁ బెనఁగఁ జొచ్చె
Language

(॥పల్లవి॥)
సరిమోహా లిద్దరికి సాటికిఁ బెనఁగఁ జొచ్చె
వరుసతో జవ్వనము వావెరుఁగునా

(॥॥)
పొంచి నీతో నవ్వఁబోతే పోఁకముడి నాకు జారీ
నించి యంతలోఁ జెమట నీకుఁ గారీని
పంచలఁ జెలులివి చూచి పకపక నవ్వేరు
చించుకొని వలపులు సెగ్గెరుఁగునా

(॥॥)
మాట నీతో నాడఁబోతే మర్మములు గరఁగె నాకు
గాఁటమై నీకంతలోనే గరుపారెను
తేటతెల్లమాయనంటా తెఱవ లాడుకొనేరు
వాఁటమైన మనసిది వాసెఱుఁగునా

(॥॥)
కాఁగిట నిన్నుఁ గూడఁగా కళదాఁకె నాకు నేఁడు
మూఁగిన పరవశాలు ముంచె నీకును
చేఁగదేరఁ గూడితిమి శ్రీ వేంకటేశ మనము
దాఁగరాని రతులివి తతెఱుఁగునా

(||pallavi||)
sarimohā liddarigi sāḍigim̐ bĕnam̐gam̐ jŏchchĕ
varusado javvanamu vāvĕrum̐gunā

(||||)
pŏṁchi nīdo navvam̐bode pom̐kamuḍi nāgu jārī
niṁchi yaṁtalom̐ jĕmaḍa nīgum̐ gārīni
paṁchalam̐ jĕlulivi sūsi pagabaga navveru
siṁchugŏni valabulu sĕggĕrum̐gunā

(||||)
māḍa nīdo nāḍam̐bode marmamulu garam̐gĕ nāgu
gām̐ṭamai nīgaṁtalone garubārĕnu
teḍadĕllamāyanaṁṭā tĕṟava lāḍugŏneru
vām̐ṭamaina manasidi vāsĕṟum̐gunā

(||||)
kām̐giḍa ninnum̐ gūḍam̐gā kaḽadām̐kĕ nāgu nem̐ḍu
mūm̐gina paravaśhālu muṁchĕ nīgunu
sem̐gaderam̐ gūḍidimi śhrī veṁkaḍeśha manamu
dām̐garāni radulivi tadĕṟum̐gunā