సరిమేలు గలిగితే సంతోసించఁగఁ బాడీ
(॥పల్లవి॥)
సరిమేలు గలిగితే సంతోసించఁగఁ బాడీ
గరిమ నీకేల సిగ్గు కడు మెచ్చవయ్యా
(॥రి॥)
కలికి నిన్నుఁజూచి కందువలకు లాచి
వెలయ నీరతులకు వేళగాచీని
పలుకులనుఁ గొసరి పయ్యదకొంగు విసరి
చెలఁగి యెన్నిచేఁతలు సేసీ మెచ్చవయ్యా
(॥రి॥)
చన్నులు నీపై మోపి చవు లంతలోనె రేఁపి
మున్ను మున్ను గానే నీకు మోవి చూపీని
కిన్నెర మీటులు మీటి కెలసి వలపు చాటీ
యెన్నెని నేరుచుకొన్న దీపెను మెచ్చరయ్యా
(॥రి॥)
నిక్కి రతులకు బొంచి నీకు నిచ్చకమే పెంచి
గక్కన వినయములు కడు నించీని
అక్కున శ్రీవేంకటేశ అలమేలుమంగపతిని
చిక్కి నన్నేలితి వీకెఁ జేకొని మెచ్చవయ్యా
(||pallavi||)
sarimelu galigide saṁtosiṁcham̐gam̐ bāḍī
garima nīgela siggu kaḍu mĕchchavayyā
(||ri||)
kaligi ninnum̐jūsi kaṁduvalagu lāsi
vĕlaya nīradulagu veḽagāsīni
palugulanum̐ gŏsari payyadagŏṁgu visari
sĕlam̐gi yĕnnisem̐talu sesī mĕchchavayyā
(||ri||)
sannulu nībai mobi savu laṁtalonĕ rem̐pi
munnu munnu gāne nīgu movi sūbīni
kinnĕra mīḍulu mīḍi kĕlasi valabu sāḍī
yĕnnĕni nerusugŏnna dībĕnu mĕchcharayyā
(||ri||)
nikki radulagu bŏṁchi nīgu nichchagame pĕṁchi
gakkana vinayamulu kaḍu niṁchīni
akkuna śhrīveṁkaḍeśha alamelumaṁgabadini
sikki nannelidi vīgĕm̐ jegŏni mĕchchavayyā