Sarileni valabula jaanagaamdavu

సరిలేని వలపుల జాణకాఁడవు
Language

(॥పల్లవి॥)
సరిలేని వలపుల జాణకాఁడవు
యిరవై నేమెల్లా నీకు నే నెచ్చరించవలెనా

(॥సరి॥)
చెయివట్టి చెయివట్టి చెలి చుద్దులు చెప్పఁగా
యేయడ పరాకు నీకు నేమయ్యా
ఆయాలంటి ఆయాలంటి యప్పటి వేఁడుకోఁగాను
కాయజ కేలికి నీకెఁ గరుణించవయ్యా

(॥సరి॥)
సన్నసేసి సన్నసేసి సారె నిన్నుఁ బిలువఁగా
యెన్నఁడు మన్నించేవు యేమయ్యా
చన్ను లొత్తి చన్ను లొత్తి సాములు నీతోఁజేయఁగా
చెన్నుగా నీకె చనవు చెల్లించఁదగదా

(॥సరి॥)
సేవసేసి సేవసేసి చేతులెత్తి మొక్కఁగాను
యేవేళఁ జిత్తగించేవు యేమయ్యా
వేవేలు చందాలను శ్రీవేంకటేశ కూడితివి
యీవిధాన నేలి యీకె నింత సేయఁదగదా

(||pallavi||)
sarileni valabula jāṇagām̐ḍavu
yiravai nemĕllā nīgu ne nĕchchariṁchavalĕnā

(||sari||)
sĕyivaṭṭi sĕyivaṭṭi sĕli suddulu sĕppam̐gā
yeyaḍa parāgu nīgu nemayyā
āyālaṁṭi āyālaṁṭi yappaḍi vem̐ḍugom̐gānu
kāyaja keligi nīgĕm̐ garuṇiṁchavayyā

(||sari||)
sannasesi sannasesi sārĕ ninnum̐ biluvam̐gā
yĕnnam̐ḍu manniṁchevu yemayyā
sannu lŏtti sannu lŏtti sāmulu nīdom̐jeyam̐gā
sĕnnugā nīgĕ sanavu sĕlliṁcham̐dagadā

(||sari||)
sevasesi sevasesi sedulĕtti mŏkkam̐gānu
yeveḽam̐ jittagiṁchevu yemayyā
vevelu saṁdālanu śhrīveṁkaḍeśha kūḍidivi
yīvidhāna neli yīgĕ niṁta seyam̐dagadā