Sarigi besigi meeru salamu limkaanele

సరికి బేసికి మీరు చలము లింకానేలే
Language

(॥పల్లవి॥)
సరికి బేసికి మీరు చలము లింకానేలే
సరములు విరసములు చౌకగదే ఇపుడు

(॥॥)
మనసులోపలిగుట్టు మాటలలోపలిరట్టు
చనవుగలపతితోడ జరపఁదగునా
కొనచూపులో కొసరు గొణఁగులో నసురుసురు
మునుపనే పతికి పతి ముంచెఁగదె అతఁడు

(॥॥)
సెలవిలోపలి నగవు చేసన్నలో బిగువు
పిలువఁగా బతితోడ పెంచఁదగునా
నిలువులో నివ్వెరగు నిండుఁజెమటకరఁగు
చలివాయ నీమీఁదఁ జల్లెఁగదె అతఁడు

(॥॥)
వచ్చిదేరేటి యాస పదరి అడిగెడిబాస
ముచ్చట శ్రీవేంకటేశు ముంచఁదగునా
పెచ్చువెరిగేటి ప్రియము బిగువుఁ గాఁగిటినయము
నిచ్చలును నీమీఁద నెరపుఁగదె అతఁడు

(||pallavi||)
sarigi besigi mīru salamu liṁkānele
saramulu virasamulu saugagade ibuḍu

(||||)
manasulobaliguṭṭu māḍalalobaliraṭṭu
sanavugalabadidoḍa jarabam̐dagunā
kŏnasūbulo kŏsaru gŏṇam̐gulo nasurusuru
munubane padigi padi muṁchĕm̐gadĕ adam̐ḍu

(||||)
sĕlavilobali nagavu sesannalo biguvu
piluvam̐gā badidoḍa pĕṁcham̐dagunā
niluvulo nivvĕragu niṁḍum̐jĕmaḍagaram̐gu
salivāya nīmīm̐dam̐ jallĕm̐gadĕ adam̐ḍu

(||||)
vachchidereḍi yāsa padari aḍigĕḍibāsa
muchchaḍa śhrīveṁkaḍeśhu muṁcham̐dagunā
pĕchchuvĕrigeḍi priyamu biguvum̐ gām̐giḍinayamu
nichchalunu nīmīm̐da nĕrabum̐gadĕ adam̐ḍu