Sarigi beshaaya nidi saaladaa nemdu

సరికి బేశాయ నిది చాలదా నేఁడు
Language

(॥పల్లవి॥)
సరికి బేశాయ నిది చాలదా నేఁడు
యిరవాయఁ బనులెల్ల నిఁకనేల మాటలు

(॥సరి॥)
బయలువంటిదె నాపట్టి ననెన్నడుము
బయలుపందిలి నీపలుకులెల్లా
నయమైనకుచములు నావి కొండలవంటివి
దయలేని నీమనసు తగురాతివంటిది

(॥సరి॥)
నిండిననాతురుమున నెరులెల్లా వంకలే
చండియై నీమేనెల్లా చంద్రవంకలే
పండిననామోవి ఇదె పైపైనే కడుఁదీపు
దండినీవినయములు తరితీపులే

(॥సరి॥)
మెఱుఁగువంటిదివో మించయిననామేను
మెఱుఁగువంటిదెపో నీమేఁటివలపు
నెఱి శ్రీవేంకటేశ్వర నీవే ననుఁ గూడితివి
తఱితోడఁ జవులాయ తగిననీరతులు

(||pallavi||)
sarigi beśhāya nidi sāladā nem̐ḍu
yiravāyam̐ banulĕlla nim̐kanela māḍalu

(||sari||)
bayaluvaṁṭidĕ nābaṭṭi nanĕnnaḍumu
bayalubaṁdili nībalugulĕllā
nayamainagusamulu nāvi kŏṁḍalavaṁṭivi
dayaleni nīmanasu tagurādivaṁṭidi

(||sari||)
niṁḍinanādurumuna nĕrulĕllā vaṁkale
saṁḍiyai nīmenĕllā saṁdravaṁkale
paṁḍinanāmovi idĕ paibaine kaḍum̐dību
daṁḍinīvinayamulu taridībule

(||sari||)
mĕṟum̐guvaṁṭidivo miṁchayinanāmenu
mĕṟum̐guvaṁṭidĕbo nīmem̐ṭivalabu
nĕṟi śhrīveṁkaḍeśhvara nīve nanum̐ gūḍidivi
taṟidoḍam̐ javulāya taginanīradulu