సరిగాఁడు వీఁడనవలదు జగమున రాజు వలసినది దేవులు
(॥పల్లవి॥)
సరిగాఁడు వీఁడనవలదు జగమున రాజు వలసినది దేవులు
యిరవుగ నందరు లోకములోపల యిది నానుడిమాట
(॥సరి॥)
జగదేకబంధుఁడవట సకలజీవులకును గుఱుతుగ
మొగము చూపవయ్యా మీకు మొక్కెద నిదె నేను
తగులైన చుట్టరికము దాఁచఁగ నిఁకనేలా
తెగరాని మమకారము తెలుపఁగవలెఁ గాని
(॥సరి॥)
యితవైన ప్రాణమవట యీచరాచరములకు అభయము
సతత మియ్యవయ్యా మాకును సన్నుతింతు నిన్ను
మతిఁ బాయని కూటంబులు మానుప మరి యాలా
జతనంబునఁ జాలాఁ బ్రియములు జరపఁగవలెఁ గాని
(॥సరి॥)
నెలవైన యేలికెవట నీదాసులకెల్లా వేళలు
దెలియఁజెప్పవయ్యా మిమ్మును తిరముగఁ గొలిచెదను
బలువయిన శ్రీవేంకటేశ పరాకు లిఁకనేలా
చెలరేఁగి నీసులభత్వమే చెల్లించవలెఁ గాని
(||pallavi||)
sarigām̐ḍu vīm̐ḍanavaladu jagamuna rāju valasinadi devulu
yiravuga naṁdaru logamulobala yidi nānuḍimāḍa
(||sari||)
jagadegabaṁdhum̐ḍavaḍa sagalajīvulagunu guṟuduga
mŏgamu sūbavayyā mīgu mŏkkĕda nidĕ nenu
tagulaina suṭṭarigamu dām̐sam̐ga nim̐kanelā
tĕgarāni mamagāramu tĕlubam̐gavalĕm̐ gāni
(||sari||)
yidavaina prāṇamavaḍa yīsarāsaramulagu abhayamu
sadata miyyavayyā māgunu sannudiṁtu ninnu
madim̐ bāyani kūḍaṁbulu mānuba mari yālā
jadanaṁbunam̐ jālām̐ briyamulu jarabam̐gavalĕm̐ gāni
(||sari||)
nĕlavaina yeligĕvaḍa nīdāsulagĕllā veḽalu
dĕliyam̐jĕppavayyā mimmunu tiramugam̐ gŏlisĕdanu
baluvayina śhrīveṁkaḍeśha parāgu lim̐kanelā
sĕlarem̐gi nīsulabhatvame sĕlliṁchavalĕm̐ gāni