సరిగా మన్నించవద్దా సవతుల నందరిని
(॥పల్లవి॥)
సరిగా మన్నించవద్దా సవతుల నందరిని
సొరిదిఁ దమ మోములు చూచుకోనే రిందరు
(॥సరి॥)
సముకాన నుండి యాపె సలిగెలు చూపఁగాను
తమితో నవ్వులు నవ్వి తనరఁగాను
జమళిఁ జేతులు వేసి సాము నీతోఁ జేయఁగాను
చెమటల తాముఁజూచి సిగ్గువడే రిందరు
(॥సరి॥)
తగిలి తగిలి యీకె తతిగొని చూడఁగాను
మిగులా సరసమాడి మెచ్చఁగాను
పొగరునీచేఁతలకు బొమ్మల జంకించఁగాను
అగపడి కరఁగేరు ఆసతో నిందరును
(॥సరి॥)
అలమేలుమంగ నిన్ను అంటి కాఁగిలించఁగాను
చెలరేఁగి అట్టె సారెఁ జెనకఁగాను
యెలమి శ్రీవేంకటేశ ఇదె నీవోజ మెచ్చఁగా
సొలసి తామునుఁ గూడి చొక్కి రిందరును
(||pallavi||)
sarigā manniṁchavaddā savadula naṁdarini
sŏridim̐ dama momulu sūsugone riṁdaru
(||sari||)
samugāna nuṁḍi yābĕ saligĕlu sūbam̐gānu
tamido navvulu navvi tanaram̐gānu
jamaḽim̐ jedulu vesi sāmu nīdom̐ jeyam̐gānu
sĕmaḍala tāmum̐jūsi sigguvaḍe riṁdaru
(||sari||)
tagili tagili yīgĕ tadigŏni sūḍam̐gānu
migulā sarasamāḍi mĕchcham̐gānu
pŏgarunīsem̐talagu bŏmmala jaṁkiṁcham̐gānu
agabaḍi karam̐geru āsado niṁdarunu
(||sari||)
alamelumaṁga ninnu aṁṭi kām̐giliṁcham̐gānu
sĕlarem̐gi aṭṭĕ sārĕm̐ jĕnagam̐gānu
yĕlami śhrīveṁkaḍeśha idĕ nīvoja mĕchcham̐gā
sŏlasi tāmunum̐ gūḍi sŏkki riṁdarunu