Saribesulaayanu mee sarasamu niddarigi

సరిబేసులాయను మీ సరసము నిద్దరికి
Language

(॥పల్లవి॥)
సరిబేసులాయను మీ సరసము నిద్దరికి
మెరసిన మీ చేతుఁలు మెచ్చితి మిందరము

(॥సరి॥)
చెలి నీయెదుట నుండి సేనిన చేసన్నలకు
అలరులదండ వేసి తాకె మీఁదను
సొలసి కమ్మటి నిన్ను సోఁకగఁజూచినందుకు
తలకొని మర్మములు దగుల నాడితివి

(॥సరి॥)
ఆపె నీకు మొక్కు మొక్కి యాసలు రేఁచినందుకు
తీపులమోవి చూపి తేలించితివి
రాపున నిన్నంటఁబట్టి రతికిఁ దీసినందుకు
యేపునఁ జనవిచ్చి నీవిట్టె ఇయ్యకొంటివి

(॥సరి॥)
మరిగించుక నిన్నాపె మతి చొక్కించినందుకు
బెరసి నీవురముఁ బెట్టుకొంటివి
యిరవై శ్రీవేంకటేశ యీకె యలమేలుమంగ
సరుగనఁ గూడి సంతోసములు నించితివి

(||pallavi||)
saribesulāyanu mī sarasamu niddarigi
mĕrasina mī sedum̐lu mĕchchidi miṁdaramu

(||sari||)
sĕli nīyĕduḍa nuṁḍi senina sesannalagu
alaruladaṁḍa vesi tāgĕ mīm̐danu
sŏlasi kammaḍi ninnu som̐kagam̐jūsinaṁdugu
talagŏni marmamulu dagula nāḍidivi

(||sari||)
ābĕ nīgu mŏkku mŏkki yāsalu rem̐sinaṁdugu
tībulamovi sūbi teliṁchidivi
rābuna ninnaṁṭam̐baṭṭi radigim̐ dīsinaṁdugu
yebunam̐ janavichchi nīviṭṭĕ iyyagŏṁṭivi

(||sari||)
marigiṁchuga ninnābĕ madi sŏkkiṁchinaṁdugu
bĕrasi nīvuramum̐ bĕṭṭugŏṁṭivi
yiravai śhrīveṁkaḍeśha yīgĕ yalamelumaṁga
saruganam̐ gūḍi saṁtosamulu niṁchidivi