Saribesi valabulu savule kaavaa

సరిబేసి వలపులు చవులే కావా
Language

(॥పల్లవి॥)
సరిబేసి వలపులు చవులే కావా
సొరిది నీ నేరుపెల్లాఁ జూపఁరాదా

(॥సరి॥)
కప్పురనా వేసెనంటా కాంతనేల తిట్టేవు
చిప్పిల బన్నీట నీవూఁ జిమ్మరాదా
ఆప్పటిఁ బాదము దొక్కెనంటానేల జంకించేవు
పిప్పిగాఁ గందువలంటి పెనఁగరాదా

(॥సరి॥)
గొరు సోఁకించెనంటాను కొమ్మ నెంత సాదించేవు
చేరి నీవూ మోని గంటిసేయరాదా
కేరి కేరి నవ్వెనంటా కెరలి యేమిచూచేవు
మేరతో మారుకుమారు మేలమాడరాదా

(॥సరి॥)
పంతమాడె నీతోనంటా భామనేల గద్దించేవు
చెంత నీవూఁ గుచములు చెనకరాదా
ఇంతలో శ్రీవేంకటేశ యాకె నిట్టె యేలితివి
మంతనాన నీ రతులు మరిగించరాదా

(||pallavi||)
saribesi valabulu savule kāvā
sŏridi nī nerubĕllām̐ jūbam̐rādā

(||sari||)
kappuranā vesĕnaṁṭā kāṁtanela tiṭṭevu
sippila bannīḍa nīvūm̐ jimmarādā
āppaḍim̐ bādamu dŏkkĕnaṁṭānela jaṁkiṁchevu
pippigām̐ gaṁduvalaṁṭi pĕnam̐garādā

(||sari||)
gŏru som̐kiṁchĕnaṁṭānu kŏmma nĕṁta sādiṁchevu
seri nīvū moni gaṁṭiseyarādā
keri keri navvĕnaṁṭā kĕrali yemisūsevu
merado mārugumāru melamāḍarādā

(||sari||)
paṁtamāḍĕ nīdonaṁṭā bhāmanela gaddiṁchevu
sĕṁta nīvūm̐ gusamulu sĕnagarādā
iṁtalo śhrīveṁkaḍeśha yāgĕ niṭṭĕ yelidivi
maṁtanāna nī radulu marigiṁcharādā