Sari nichchagamaadide saayagu vachchum banulu

సరి నిచ్చకమాడితే చాయకు వచ్చుఁ బనులు
Language

(॥పల్లవి॥)
సరి నిచ్చకమాడితే చాయకు వచ్చుఁ బనులు
నిరతపువారి కివి నేరుచుకొనవలయు

(॥సరి॥)
సలిగెలఁ బొరలేటిసతితోను రమణుఁడు
చలము సాదించఁబోతే చండిపడును
పెలుచుగుణముదానిఁ బిలిచి పెనఁగితేను
చలరేఁగి పంతములే చిమ్మిరేఁగును

(॥సరి॥)
మందెమేళపుటింతిని మస్తరించవలెఁగాని
ఇందరిలో జంకించితే యీసురేఁగును
సందుసుడికత్తెకు నాసలు చూపవలెఁగాని
గొందుల నణఁచఁబోతే గొణఁగుచుఁ దిట్టును

(॥సరి॥)
మొగమోట సతితోను ముచ్చటలాడుటే మేలు
వెగటు బంతాలైతే వేసటౌను
నిగిడి శ్రీవేంకటేశ నే డీఁకె నేలితివి
పగటుటు నెరపితేఁ బచ్చిదేరుఁ బ్రియము

(||pallavi||)
sari nichchagamāḍide sāyagu vachchum̐ banulu
niradabuvāri kivi nerusugŏnavalayu

(||sari||)
saligĕlam̐ bŏraleḍisadidonu ramaṇum̐ḍu
salamu sādiṁcham̐bode saṁḍibaḍunu
pĕlusuguṇamudānim̐ bilisi pĕnam̐gidenu
salarem̐gi paṁtamule simmirem̐gunu

(||sari||)
maṁdĕmeḽabuḍiṁtini mastariṁchavalĕm̐gāni
iṁdarilo jaṁkiṁchide yīsurem̐gunu
saṁdusuḍigattĕgu nāsalu sūbavalĕm̐gāni
gŏṁdula naṇam̐sam̐bode gŏṇam̐gusum̐ diṭṭunu

(||sari||)
mŏgamoḍa sadidonu muchchaḍalāḍuḍe melu
vĕgaḍu baṁtālaide vesaḍaunu
nigiḍi śhrīveṁkaḍeśha ne ḍīm̐kĕ nelidivi
pagaḍuḍu nĕrabidem̐ bachchiderum̐ briyamu