Sari neṟimgimchavayya jaadado nadasemgaani

సరి నెఱిఁగించవయ్య జాడతో నడచేఁగాని
Language

(॥పల్లవి॥)
సరి నెఱిఁగించవయ్య జాడతో నడచేఁగాని
కరుణానిధివి నీకుఁ గన్నుల మొక్కేను

(॥సరి॥)
తెగరాని చుట్టాలకు దీమస మెంతైనాఁ గద్దు
నగవుల చుట్టాలకు నాలే కలరి
పగతోడి చుట్టాలకు పట్టినదెల్లాఁ బంతము
సొగిసిఇందులో నీవే చుట్టమవు నాకు

(॥సరి॥)
ఆసపడ్డవారికి నడ్డాఁకలే లేవు
వాసులు దలఁచుకొంటే వట్టినేరాలే
వేసరేటివారికి వింతలే లోకములెల్లా
యీసరి నెన్నుకొంటేను యెవ్వరు నీవు నాకు

(॥సరి॥)
కూడినట్టి నీకు నాకు గుణములే మీఁద మీఁద
వాడు దేరేవారికి వలవంతలే
యీడనే శ్రీ వేంకటేశ యెనసితి విటు నన్ను
పాడితో నున్నవారికి భాగభోగ్యాలే

(||pallavi||)
sari nĕṟim̐giṁchavayya jāḍado naḍasem̐gāni
karuṇānidhivi nīgum̐ gannula mŏkkenu

(||sari||)
tĕgarāni suṭṭālagu dīmasa mĕṁtainām̐ gaddu
nagavula suṭṭālagu nāle kalari
pagadoḍi suṭṭālagu paṭṭinadĕllām̐ baṁtamu
sŏgisiiṁdulo nīve suṭṭamavu nāgu

(||sari||)
āsabaḍḍavārigi naḍḍām̐kale levu
vāsulu dalam̐sugŏṁṭe vaṭṭinerāle
vesareḍivārigi viṁtale logamulĕllā
yīsari nĕnnugŏṁṭenu yĕvvaru nīvu nāgu

(||sari||)
kūḍinaṭṭi nīgu nāgu guṇamule mīm̐da mīm̐da
vāḍu derevārigi valavaṁtale
yīḍane śhrī veṁkaḍeśha yĕnasidi viḍu nannu
pāḍido nunnavārigi bhāgabhogyāle