సరవు లెరఁగ మయ్య చాలు నింత కోపము
(॥పల్లవి॥)
సరవు లెరఁగ మయ్య చాలు నింత కోపము
కరగించి సొలసితే గర్వ మనేవూ
(॥సరవు॥)
కందువలుగా నీకుఁ గతలు నేఁ జెప్పఁ గాను
అంది నీమీఁద బెట్టుక అట్టె నవ్వేవు
యిందు రమ్మనుచు నిన్ను నింటికిఁ బిలచుకొంటే
యెందో పో నియ్య ననుచు నెమ్మె చూపేవూ
(॥సరవు॥)
వద్ద నుండి సతులను వారి వీరిఁ జూపితేను
అద్దో నింద లాడె నంటా నాన వెట్టేవు
తిద్దుకో కస్తూరిబొట్టు తెర దిగ వేయు మంటే
గద్దించి యట్టె నన్నుఁ గాఁగిలించేవూ
(॥సరవు॥)
పూస గుచ్చినట్టు నీకు బుద్దులు నేఁ జెప్పితేను
ఆసతో నామోవి మోవి నందుకొనేవు
వానితో శ్రీవెంకటేశ వడి నన్నుఁ గూడితివి
రాసి కెక్కితి వంటేను రతికిఁ దీసేవూ
(||pallavi||)
saravu lĕram̐ga mayya sālu niṁta kobamu
karagiṁchi sŏlaside garva manevū
(||saravu||)
kaṁduvalugā nīgum̐ gadalu nem̐ jĕppam̐ gānu
aṁdi nīmīm̐da bĕṭṭuga aṭṭĕ navvevu
yiṁdu rammanusu ninnu niṁṭigim̐ bilasugŏṁṭe
yĕṁdo po niyya nanusu nĕmmĕ sūbevū
(||saravu||)
vadda nuṁḍi sadulanu vāri vīrim̐ jūbidenu
addo niṁda lāḍĕ naṁṭā nāna vĕṭṭevu
tiddugo kastūribŏṭṭu tĕra diga veyu maṁṭe
gaddiṁchi yaṭṭĕ nannum̐ gām̐giliṁchevū
(||saravu||)
pūsa guchchinaṭṭu nīgu buddulu nem̐ jĕppidenu
āsado nāmovi movi naṁdugŏnevu
vānido śhrīvĕṁkaḍeśha vaḍi nannum̐ gūḍidivi
rāsi kĕkkidi vaṁṭenu radigim̐ dīsevū