Sarasumda vinnidaanu salamemtigi

సరసుఁడ విన్నిటాను చలమేఁటికి
Language

(॥పల్లవి॥)
సరసుఁడ విన్నిటాను చలమేఁటికి
యెరపరికములేల యియ్యకొనరాదా

(॥సర॥)
చేయెత్తి మొక్కితి నిన్నుఁ జెనకిన చేఁతలకు
వాయెత్తి పాడితి నీతో వాదు దీరను
యీయెడ నింకా నీకు నేమి సేయవలె నేను
మాయకాఁడ అలుగక మాటలాడవయ్యా

(॥సర॥)
నవ్వులు నవ్వితి నీతో నానాటి యలపు దీర
పువ్వుల వేసీతి సొలపులు దీరను
చివ్వన నింకా నీపైఁ జిత్త మెటువలె వచ్చు
రవ్వకాఁడ మాతోను రాయడించకువయ్యా

(॥సర॥)
శిరసు వంచితి నీతో సిగ్గులు వడినందుకు
కరఁగించితిని నిన్ను కాఁక దీరను
దొరకె నారతి నీకు తుదమొదలే లేదు
నిరతి శ్రీ వేంకటేశ నేరుపు చెల్లునయ్యా

(||pallavi||)
sarasum̐ḍa vinniḍānu salamem̐ṭigi
yĕrabarigamulela yiyyagŏnarādā

(||sara||)
seyĕtti mŏkkidi ninnum̐ jĕnagina sem̐talagu
vāyĕtti pāḍidi nīdo vādu dīranu
yīyĕḍa niṁkā nīgu nemi seyavalĕ nenu
māyagām̐ḍa alugaga māḍalāḍavayyā

(||sara||)
navvulu navvidi nīdo nānāḍi yalabu dīra
puvvula vesīdi sŏlabulu dīranu
sivvana niṁkā nībaim̐ jitta mĕḍuvalĕ vachchu
ravvagām̐ḍa mādonu rāyaḍiṁchaguvayyā

(||sara||)
śhirasu vaṁchidi nīdo siggulu vaḍinaṁdugu
karam̐giṁchidini ninnu kām̐ka dīranu
dŏragĕ nāradi nīgu tudamŏdale ledu
niradi śhrī veṁkaḍeśha nerubu sĕllunayyā