సరసుఁడ విన్నిటాను జాణవు నీవు
(॥పల్లవి॥)
సరసుఁడ విన్నిటాను జాణవు నీవు
వొరసె నిందాఁకా సతి వోరుచుకోవయ్యా
(॥సర॥)
మనసొక్కటైన దాఁకా మాటలు సూటిఁబడవు
యెనయకుండితే నన్నీ యెరవెరవే
నినుఁబాసి విరహాన నెలఁత యెంత దూరెనో
వొనరితి విఁక నని వోరుచుకోవయ్యా
(॥సర॥)
సిగ్గులు దేరినదాఁకా చేఁతలు సమ్మతిగావు
దగ్గరఁ గూచున్నదాఁకా తనివిలేదు
కగ్గి నీవు రా నట్టె కాతరాన నెట్టుండెనో
వొగ్గి మన్నించితి నిఁక నోరుచుకోవయ్యా
(॥సర॥)
కలసికూడినదాఁకా కడమలు దీరవు
చలములు మానితేనే చవివుట్టును
యెలమి శ్రీవేంకటేశ యిప్పుడీ కెంత మెచ్చెనో
వొలసి యేలితి విఁక నోరుచుకోవయ్యా
(||pallavi||)
sarasum̐ḍa vinniḍānu jāṇavu nīvu
vŏrasĕ niṁdām̐kā sadi vorusugovayyā
(||sara||)
manasŏkkaḍaina dām̐kā māḍalu sūḍim̐baḍavu
yĕnayaguṁḍide nannī yĕravĕrave
ninum̐bāsi virahāna nĕlam̐ta yĕṁta dūrĕno
vŏnaridi vim̐ka nani vorusugovayyā
(||sara||)
siggulu derinadām̐kā sem̐talu sammadigāvu
daggaram̐ gūsunnadām̐kā taniviledu
kaggi nīvu rā naṭṭĕ kādarāna nĕṭṭuṁḍĕno
vŏggi manniṁchidi nim̐ka norusugovayyā
(||sara||)
kalasigūḍinadām̐kā kaḍamalu dīravu
salamulu mānidene savivuṭṭunu
yĕlami śhrīveṁkaḍeśha yippuḍī kĕṁta mĕchchĕno
vŏlasi yelidi vim̐ka norusugovayyā