సరసుఁడ వవుదువు జాణ వవుదువు
(॥పల్లవి॥)
సరసుఁడ వవుదువు జాణ వవుదువు
యిరవైన పనులు మీరిద్దరికిఁ దగును
(॥సర॥)
కళలు మోమున నిండె కన్నులఁ జెంగాని మించె
సెలవులఁ జిరునవ్వు చిమ్మిరేఁగెను
యెలమి నేకతమున నింతి నేమిసేసితివో
వులివచ్చి సిగ్గులను వోలలాడీని
(॥సర॥)
చెమట చెక్కులఁ గారె చిత్తము సంతసమందె
తమి మేనఁ బులకలు దైవారెను
రమణితో నీవెంత రతిసాము సేసితివో
తిమురుచు సంతోసాన తప్పలఁ దేలీని
(॥సర॥)
మోవిపైఁ దేనియ లూరె ముచ్చటలు నోరికబ్బె
పూవులు కొప్పన నుండి పొందుగ రాలె
శ్రీవేంకటేశుఁడు కాంతఁ జెంది యెంత చేసితివో
వేవేలు వేడుకలను వినోదించీని
(||pallavi||)
sarasum̐ḍa vavuduvu jāṇa vavuduvu
yiravaina panulu mīriddarigim̐ dagunu
(||sara||)
kaḽalu momuna niṁḍĕ kannulam̐ jĕṁgāni miṁchĕ
sĕlavulam̐ jirunavvu simmirem̐gĕnu
yĕlami negadamuna niṁti nemisesidivo
vulivachchi siggulanu volalāḍīni
(||sara||)
sĕmaḍa sĕkkulam̐ gārĕ sittamu saṁtasamaṁdĕ
tami menam̐ bulagalu daivārĕnu
ramaṇido nīvĕṁta radisāmu sesidivo
timurusu saṁtosāna tappalam̐ delīni
(||sara||)
movibaim̐ deniya lūrĕ muchchaḍalu norigabbĕ
pūvulu kŏppana nuṁḍi pŏṁduga rālĕ
śhrīveṁkaḍeśhum̐ḍu kāṁtam̐ jĕṁdi yĕṁta sesidivo
vevelu veḍugalanu vinodiṁchīni