సరసుఁడ వన్నిటాను సర్వజాణవు
(॥పల్లవి॥)
సరసుఁడ వన్నిటాను సర్వజాణవు
తరుణిమీఁదట దయదలచఁగ వలదా
(॥రి॥)
చిగురుఁబెదవులనుఁ జెప్పె నీకుఁ బ్రియములు
మెగము చూచినప్పుడే మొక్కె నీకును
తగులు గావలెనంటా దండనే కొలువుసేసె
మగిడి యింతటనైనా మన్నించవలదా
(॥రి॥)
కలికికనుచూపులఁ గడునిన్నుఁ బూజించె
సెలవినవ్వులఁ బ్రేమ చిమ్మిరేఁచెను
సోలయుచుఁ గుచములు సూడిదలుగాఁబట్టె
తలఁపెరిఁగిం చాకె నాదరించఁగవలదా
(॥రి॥)
కోరి చుట్టరికములు కూడఁజెప్పె నిందాఁకా
చేరి కాఁగిటిరతుల సేవసేసెను
యీరీతి శ్రీవేంకటేశ యీకె యలమేలుమంగ
సారెఁ జెనకే విట్టే చనవియ్యరాదా
(||pallavi||)
sarasum̐ḍa vanniḍānu sarvajāṇavu
taruṇimīm̐daḍa dayadalasam̐ga valadā
(||ri||)
sigurum̐bĕdavulanum̐ jĕppĕ nīgum̐ briyamulu
mĕgamu sūsinappuḍe mŏkkĕ nīgunu
tagulu gāvalĕnaṁṭā daṁḍane kŏluvusesĕ
magiḍi yiṁtaḍanainā manniṁchavaladā
(||ri||)
kaligiganusūbulam̐ gaḍuninnum̐ būjiṁchĕ
sĕlavinavvulam̐ brema simmirem̐sĕnu
solayusum̐ gusamulu sūḍidalugām̐baṭṭĕ
talam̐pĕrim̐giṁ sāgĕ nādariṁcham̐gavaladā
(||ri||)
kori suṭṭarigamulu kūḍam̐jĕppĕ niṁdām̐kā
seri kām̐giḍiradula sevasesĕnu
yīrīdi śhrīveṁkaḍeśha yīgĕ yalamelumaṁga
sārĕm̐ jĕnage viṭṭe sanaviyyarādā