సరసుఁడ వన్నిటాను సర్వజాణవు
(॥పల్లవి॥)
సరసుఁడ వన్నిటాను సర్వజాణవు
గరిమ నన్నీఁ దెలియఁ గదవయ్య నీవు
(॥ర॥)
సన్నలు సేసీ నీకు జవరాలు
యిన్నిటాను నీకిప్పుడేడ పరాకు
కిన్నెర వాయించీ నదె కెరలుచును
విన్నపాలందే వున్నవి వినవయ్య నీవు
(॥ర॥)
తప్పక చూచీ నదె తరుణి
యిప్పుడు నీతమకములేడ నున్నవి
చిప్పిలుఁజెమట గోరఁ జిమ్మీ నీపై
వొప్పగించి వలపిట్టే వుండవయ్య నీవు
(॥ర॥)
మిక్కిలిఁ గొసరీ నలమేలుమంగ
యెక్కడెక్కడ నీగుండె యెటువంటిది
వొక్కటై శ్రీవేంకటేశ వొనరె నీకె
పిక్కటిల్లఁ దమ్ములము పెట్టవయ్య నీవు
(||pallavi||)
sarasum̐ḍa vanniḍānu sarvajāṇavu
garima nannīm̐ dĕliyam̐ gadavayya nīvu
(||ra||)
sannalu sesī nīgu javarālu
yinniḍānu nīgippuḍeḍa parāgu
kinnĕra vāyiṁchī nadĕ kĕralusunu
vinnabālaṁde vunnavi vinavayya nīvu
(||ra||)
tappaga sūsī nadĕ taruṇi
yippuḍu nīdamagamuleḍa nunnavi
sippilum̐jĕmaḍa goram̐ jimmī nībai
vŏppagiṁchi valabiṭṭe vuṁḍavayya nīvu
(||ra||)
mikkilim̐ gŏsarī nalamelumaṁga
yĕkkaḍĕkkaḍa nīguṁḍĕ yĕḍuvaṁṭidi
vŏkkaḍai śhrīveṁkaḍeśha vŏnarĕ nīgĕ
pikkaḍillam̐ dammulamu pĕṭṭavayya nīvu