సరసుఁడ వన్నిటాను చతురుఁడవు
(॥పల్లవి॥)
సరసుఁడ వన్నిటాను చతురుఁడవు
తరుణి నీకు మేలుది దయఁజూడఁదగును
(॥సర॥)
తలపోసి తలసోసి తనలోనె నవ్వు నవ్వు
చెలి నీసుద్దు లడిగి చెమరించును
సొలసి నీకెదురులు చూచి నివ్వెరగందు
కలదెల్లాఁ జెప్పితిమి కరుణించఁదగును
(॥సర॥)
చేతులెత్తి యెత్తి మొక్కు సిగ్గువడు నంతలోనె
దూతికల నీకు నెదురుగా నంపు
రాతురులు వేగించు రతులకు నాసపడు
కాతరాన నున్న యింతిఁ గరుణించఁదగును
(॥సర॥)
పిలిచి పిలిచి నీకుఁ బ్రియములు సారెఁ జెప్ప
అలరఁగ వ్రాసి లేకలంపు నీకును
యెలమి శ్రీవేంకటేశ యింతలోనె వచ్చి కాంత
గలసితి విట్లానే కరుణించఁ దగును
(||pallavi||)
sarasum̐ḍa vanniḍānu sadurum̐ḍavu
taruṇi nīgu meludi dayam̐jūḍam̐dagunu
(||sara||)
talabosi talasosi tanalonĕ navvu navvu
sĕli nīsuddu laḍigi sĕmariṁchunu
sŏlasi nīgĕdurulu sūsi nivvĕragaṁdu
kaladĕllām̐ jĕppidimi karuṇiṁcham̐dagunu
(||sara||)
sedulĕtti yĕtti mŏkku sigguvaḍu naṁtalonĕ
dūdigala nīgu nĕdurugā naṁpu
rādurulu vegiṁchu radulagu nāsabaḍu
kādarāna nunna yiṁtim̐ garuṇiṁcham̐dagunu
(||sara||)
pilisi pilisi nīgum̐ briyamulu sārĕm̐ jĕppa
alaram̐ga vrāsi legalaṁpu nīgunu
yĕlami śhrīveṁkaḍeśha yiṁtalonĕ vachchi kāṁta
galasidi viṭlāne karuṇiṁcham̐ dagunu