Sarasumda vannidaanu jaanavu neevu

సరసుఁడ వన్నిటాను జాణవు నీవు
Language

(॥పల్లవి॥)
సరసుఁడ వన్నిటాను జాణవు నీవు
యిరవుగా మా సంతోస మీడేరించవయ్యా

(॥సర॥)
నెట్టనఁ జెలి వలపు నీకు విన్నవించితి
యెట్టున్నదో నీ చిత్త మెరఁగ నేను
మట్టుమీరి నీ విచ్చినమాఁటపట్టు దలఁచుకో
పొట్టఁ బొరుగువారెల్లాఁ బొగడేరుగాని

(॥సర॥)
సరుగనఁ జెలిమారు సాగిలి నీకు మొక్కితి
కరుణించే దేవుడో కనే నిఁకను
మరిగించితి వీకెపై మన్ననలు మరవకు
నిరతపు నీ కీరీతి నిండె దిక్కులను

(॥సర॥)
అలమేలుమంగకాను కదివో నీ కొసఁగితి
మెలఁగి నీ గుణాలకు మెచ్చే నేను
యెలమి శ్రీవేంకటేశ యీకూట మిట్టె నెరపు
కలకాల మిద్దరికిఁ గలిగే వేడుకలు

(||pallavi||)
sarasum̐ḍa vanniḍānu jāṇavu nīvu
yiravugā mā saṁtosa mīḍeriṁchavayyā

(||sara||)
nĕṭṭanam̐ jĕli valabu nīgu vinnaviṁchidi
yĕṭṭunnado nī sitta mĕram̐ga nenu
maṭṭumīri nī vichchinamām̐ṭabaṭṭu dalam̐sugo
pŏṭṭam̐ bŏruguvārĕllām̐ bŏgaḍerugāni

(||sara||)
saruganam̐ jĕlimāru sāgili nīgu mŏkkidi
karuṇiṁche devuḍo kane nim̐kanu
marigiṁchidi vīgĕbai mannanalu maravagu
niradabu nī kīrīdi niṁḍĕ dikkulanu

(||sara||)
alamelumaṁgagānu kadivo nī kŏsam̐gidi
mĕlam̐gi nī guṇālagu mĕchche nenu
yĕlami śhrīveṁkaḍeśha yīgūḍa miṭṭĕ nĕrabu
kalagāla middarigim̐ galige veḍugalu