Sarasamulalonigi jagadaalela

సరసములలోనికి జగడాలేల
Language

(॥పల్లవి॥)
సరసములలోనికి జగడాలేల
బెరసి యంత గలితే పెనఁగఁగరాదా

(॥సరస॥)
మోహమునఁ జెలి నీపై మొనగో రంటించెఁగాక
సాహసాన నాపై నీతోఁ జలపట్టెనా
వూహించ కిందుకుఁగాను వూరకే మారువమోహమేల
సోహగా మొకామొకాలు చూచుకొనరాదా

(॥సరస॥)
గట్టిసేసి యాపె నిన్ను గందమున వేసెఁ గాక
గుట్టుతోడ నీమీఁది కుచ్చితములా
వట్టినొప్పు లిందుకుఁగా వహించుకో నీకేల
చుట్టపువరుస మించ జోడై వుండరాదా

(॥సరస॥)
కందువచేఁతలు చూపి కాఁగిట బిగించెఁగాక
అంది నీతో బలిమి దా నట్టె సేసెనా
ఇందుకుఁగా శ్రీవేంకటేశ బుసకొట్టనేల
పొందుగాఁ గూడితి రిట్టె భోగించరాదా

(||pallavi||)
sarasamulalonigi jagaḍālela
bĕrasi yaṁta galide pĕnam̐gam̐garādā

(||sarasa||)
mohamunam̐ jĕli nībai mŏnago raṁṭiṁchĕm̐gāga
sāhasāna nābai nīdom̐ jalabaṭṭĕnā
vūhiṁcha kiṁdugum̐gānu vūrage māruvamohamela
sohagā mŏgāmŏgālu sūsugŏnarādā

(||sarasa||)
gaṭṭisesi yābĕ ninnu gaṁdamuna vesĕm̐ gāga
guṭṭudoḍa nīmīm̐di kuchchidamulā
vaṭṭinŏppu liṁdugum̐gā vahiṁchugo nīgela
suṭṭabuvarusa miṁcha joḍai vuṁḍarādā

(||sarasa||)
kaṁduvasem̐talu sūbi kām̐giḍa bigiṁchĕm̐gāga
aṁdi nīdo balimi dā naṭṭĕ sesĕnā
iṁdugum̐gā śhrīveṁkaḍeśha busagŏṭṭanela
pŏṁdugām̐ gūḍidi riṭṭĕ bhogiṁcharādā