సరస మాకొకపొత్తే చంద్రమందానిలాదులు
(॥పల్లవి॥)
సరస మాకొకపొత్తే చంద్రమందానిలాదులు
యెరవై మమ్మింత యేఁచీ నేమిసేతు వీనిని
(॥సరు॥)
చెంగటఁ జల్లనిగాలి సీతనంటి వచ్చీనా
యంగమంటియును నింకా నారదు కాఁక
అంగనచూపు చందురు నంటె నాచూపును నంటె
అంగజతాప మారదాయఁ జూడు తమ్ముఁడా
(॥సరు॥)
యెనసి అఇదువిరులే ఇద్దరిని సోఁకినవి
ఘనమై మానవు తమకము లింకాను
వొనరె మనసులలో వొకరొకరి రూపులు
కనుఁగొనియు రతులఁ గరఁగవు మేనులు
(॥సరు॥)
కట్టితి లంకపట్టము గట్టితి చింతాజలధి
అట్టె సీతఁగూడితిఁ బాయదు చెమట
గట్టిగా వావిలిపాట ఘన శ్రీ వేంకటగిరి
జట్టిగా నున్నాడఁ రామచంద్రుఁడ నే నిదివో
(||pallavi||)
sarasa māgŏgabŏtte saṁdramaṁdānilādulu
yĕravai mammiṁta yem̐sī nemisedu vīnini
(||saru||)
sĕṁgaḍam̐ jallanigāli sīdanaṁṭi vachchīnā
yaṁgamaṁṭiyunu niṁkā nāradu kām̐ka
aṁganasūbu saṁduru naṁṭĕ nāsūbunu naṁṭĕ
aṁgajadāba māradāyam̐ jūḍu tammum̐ḍā
(||saru||)
yĕnasi a̮iduvirule iddarini som̐kinavi
ghanamai mānavu tamagamu liṁkānu
vŏnarĕ manasulalo vŏgarŏgari rūbulu
kanum̐gŏniyu radulam̐ garam̐gavu menulu
(||saru||)
kaṭṭidi laṁkabaṭṭamu gaṭṭidi siṁtājaladhi
aṭṭĕ sīdam̐gūḍidim̐ bāyadu sĕmaḍa
gaṭṭigā vāvilibāḍa ghana śhrī veṁkaḍagiri
jaṭṭigā nunnāḍam̐ rāmasaṁdrum̐ḍa ne nidivo