(॥పల్లవి॥)
సరకు గొనేవా నీవు సవతులను
దొరతనపు గర్వము తొట్టీని నీకు
(॥॥)
మంతనాన నాతఁడాడే మాటలవల్లనే కాదా
యింత పెచ్చుపెరిగితి వేమే నీవు
చెంతలఁ గొలువులోని సెలవినవ్వులఁ గాదా
దొంతి జవ్వనమదము దొరిగీని నీకు
(॥॥)
పొందుల నాతఁడు సేసే పోదులవల్లనే కాదా
మందెమేళమునఁ గడు మట్టు మీరేవు
కందువ నప్పటప్పటి కనుసన్నలనే కాదా
యిందరిలోఁ బగటులు హెచ్చీని నీకు
(॥॥)
గుట్టున శ్రీవేంకటేశు కూటమివల్లనే కాదా
పట్టిపు దేవులవై పరగితివి
యిట్టే నన్నేలినట్టి యీతనివల్లనే కాదా
చుట్టిరికములకెల్ల చోటాయ నీకు
(||pallavi||)
saragu gŏnevā nīvu savadulanu
dŏradanabu garvamu tŏṭṭīni nīgu
(||||)
maṁtanāna nādam̐ḍāḍe māḍalavallane kādā
yiṁta pĕchchubĕrigidi veme nīvu
sĕṁtalam̐ gŏluvuloni sĕlavinavvulam̐ gādā
dŏṁti javvanamadamu dŏrigīni nīgu
(||||)
pŏṁdula nādam̐ḍu sese podulavallane kādā
maṁdĕmeḽamunam̐ gaḍu maṭṭu mīrevu
kaṁduva nappaḍappaḍi kanusannalane kādā
yiṁdarilom̐ bagaḍulu hĕchchīni nīgu
(||||)
guṭṭuna śhrīveṁkaḍeśhu kūḍamivallane kādā
paṭṭibu devulavai paragidivi
yiṭṭe nannelinaṭṭi yīdanivallane kādā
suṭṭirigamulagĕlla soḍāya nīgu