Sannulu sinnavaidene saadavaa neevu

చన్నులు చిన్నవైతేనే సాదవా నీవు
Language

(॥పల్లవి॥)
చన్నులు చిన్నవైతేనే సాదవా నీవు
సన్న యెఱఁగ వదేమే సరసునితోను

(॥చన్ను॥)
చెక్కుచెయ్యాల పెట్టెవే సిగ్గులెల పెంచేవే
అక్కరతో విడెము నీకాతఁ డియ్యఁగా
చిక్కనేల పెనఁగేవే చిరునవ్వేమి నవ్వేవే
మక్కువ నిన్నుఁ జెనకేమగనితోను

(॥చన్ను॥)
చెమరించే వదియేమే చెలుల మాటిఁకనేలే
తమితో నాతఁడు నిన్నుఁ దడవఁగాను
అమర నీవేసాలేలే ఆనలు వెట్టఁగనేలే
సముకాన వేఁడుకొనే జాణపతితోను

(॥చన్ను॥)
పయ్యదేల బిగించేవే పాపటేల దువ్వేవే
చయ్యన నాతఁడు సేస చల్లఁగాను
వొయ్యనే మొక్కఁగనేలే వొడఁబాటింత యేలే
చెయ్యరా నిన్నుఁ గూడె శ్రీవేంకటేశుఁడును

(||pallavi||)
sannulu sinnavaidene sādavā nīvu
sanna yĕṟam̐ga vademe sarasunidonu

(||sannu||)
sĕkkusĕyyāla pĕṭṭĕve siggulĕla pĕṁcheve
akkarado viḍĕmu nīgādam̐ ḍiyyam̐gā
sikkanela pĕnam̐geve sirunavvemi navveve
makkuva ninnum̐ jĕnagemaganidonu

(||sannu||)
sĕmariṁche vadiyeme sĕlula māḍim̐kanele
tamido nādam̐ḍu ninnum̐ daḍavam̐gānu
amara nīvesālele ānalu vĕṭṭam̐ganele
samugāna vem̐ḍugŏne jāṇabadidonu

(||sannu||)
payyadela bigiṁcheve pābaḍela duvveve
sayyana nādam̐ḍu sesa sallam̐gānu
vŏyyane mŏkkam̐ganele vŏḍam̐bāḍiṁta yele
sĕyyarā ninnum̐ gūḍĕ śhrīveṁkaḍeśhum̐ḍunu