చనవు సేసుక మోవిచవులు గొందువు గాక
(॥పల్లవి॥)
చనవు సేసుక మోవిచవులు గొందువు గాక
తనిసితిరి రతుల నిఁకఁ దలపోఁతలేలే
(॥చన॥)
మొగము చూచినయపుడే ముంచుకొనుఁ దమకంబు
నగినయప్పడే మిగుల ననుపు గులుగు
తగులు గలిగినచోట తరితీపు లుప్పతిలు
పగటుతో నతని మె(మొ?) డఁబరచనిఁకనేలే
(॥చన॥)
సరసమాడినయపుడే సతమౌను మచ్చికలు
తెరదీసినప్పడే తేరు సిగ్గు
తొరలనాడిన వేళ తుదిముట్టుఁ గోరికలు
పెరరేఁచి వలపులనుఁ బెనఁగ నిఁకనేలే
(॥చన॥)
యెదుట నుండిన యపుడే ఇచ్చగించును మనసు
కదిసినప్పడే మదనకళలు వొడము
అదన నలమేల్మంగ వతడు శ్రీవేంకటేశుఁ
డది గదవే నిన్నేలె నడుగ నిఁకనేలే
(||pallavi||)
sanavu sesuga movisavulu gŏṁduvu gāga
tanisidiri radula nim̐kam̐ dalabom̐talele
(||sana||)
mŏgamu sūsinayabuḍe muṁchugŏnum̐ damagaṁbu
naginayappaḍe migula nanubu gulugu
tagulu galiginasoḍa taridību luppadilu
pagaḍudo nadani mĕ(mŏ?) ḍam̐barasanim̐kanele
(||sana||)
sarasamāḍinayabuḍe sadamaunu machchigalu
tĕradīsinappaḍe teru siggu
tŏralanāḍina veḽa tudimuṭṭum̐ gorigalu
pĕrarem̐si valabulanum̐ bĕnam̐ga nim̐kanele
(||sana||)
yĕduḍa nuṁḍina yabuḍe ichchagiṁchunu manasu
kadisinappaḍe madanagaḽalu vŏḍamu
adana nalamelmaṁga vadaḍu śhrīveṁkaḍeśhum̐
ḍadi gadave ninnelĕ naḍuga nim̐kanele