Sanavu sellimcharaadaa sadigi neevu

చనవు చెల్లించరాదా సతికి నీవు
Language

(॥పల్లవి॥)
చనవు చెల్లించరాదా సతికి నీవు
ననిచి యాపెతో నెంత నవ్వులు నవ్వేవు

(॥చన॥)
మేలుగలయాటది మితిమీరవలదా
యేల నీవు కొచ్చి చూచే వీఁకె నిందుకు
వోలివట్టవచ్చినది వొడివట్టవలదా
పేలరితనాననేల పెనఁగులాడేవు

(॥చన॥)
బత్తిగల జవ్వని గుబ్బల నొత్తవలదా
వొత్తీనంటా నీవేల వొడ్డుకొనేవు
హత్తిన చుట్టము నీకు నాసపడవలదా
తత్తరించి నిమ్మపంటఁ దాఁక నేలవేసేవు

(॥చన॥)
కామించివచ్చినయాపె కాఁగిలించవలదా
చేముంచి సన్నలెందాఁకాఁ జేసి చూపేవు
ప్రేమముతో నేలితి వీపెను శ్రివేంకటేశుఁడ
భామినితో రతివేళఁ బంతా లే లాడేవు

(||pallavi||)
sanavu sĕlliṁcharādā sadigi nīvu
nanisi yābĕdo nĕṁta navvulu navvevu

(||sana||)
melugalayāḍadi midimīravaladā
yela nīvu kŏchchi sūse vīm̐kĕ niṁdugu
volivaṭṭavachchinadi vŏḍivaṭṭavaladā
pelaridanānanela pĕnam̐gulāḍevu

(||sana||)
battigala javvani gubbala nŏttavaladā
vŏttīnaṁṭā nīvela vŏḍḍugŏnevu
hattina suṭṭamu nīgu nāsabaḍavaladā
tattariṁchi nimmabaṁṭam̐ dām̐ka nelavesevu

(||sana||)
kāmiṁchivachchinayābĕ kām̐giliṁchavaladā
semuṁchi sannalĕṁdām̐kām̐ jesi sūbevu
premamudo nelidi vībĕnu śhriveṁkaḍeśhum̐ḍa
bhāminido radiveḽam̐ baṁtā le lāḍevu