(॥పల్లవి॥)
చనవు గలుగుచోట చలమేఁటికి
పెనఁగఁబోతేఁ బ్రియము బెండుపడదా
(॥॥)
చెక్కునొక్కి వేఁడుకొనే చెలువునివంక చూచి
మొక్కవద్దా యేమే నీవు మోము వంచేవు
తక్కుల నాతఁడు మరి తప్పు లెన్ని సేసినాను
కక్కసించితే వలపు గరివడదా
(॥॥)
కొసరి మాటాడి పతిఁ గొంగువట్టి తీసుకొని
యెసఁగి నవ్వఁగవద్దా యెమ్మెలాడేవు
సుసరముగాక పతి సూటికెంత రాకుండినా
పిసికితే మనసైనాఁ బిప్పిగట్టిదా
(॥॥)
కూడేటి శ్రీవేంకటేశు గొబ్బుననుఁ గాగిలించి
యీడై యిట్టే వుండవద్దా యేల మీరేవు
వోడ కలమేల్మంగవు వూరకాతఁ డుండినాను
వాడుకొంటే వయసు కావరమెచ్చదా
(||pallavi||)
sanavu galugusoḍa salamem̐ṭigi
pĕnam̐gam̐bodem̐ briyamu bĕṁḍubaḍadā
(||||)
sĕkkunŏkki vem̐ḍugŏne sĕluvunivaṁka sūsi
mŏkkavaddā yeme nīvu momu vaṁchevu
takkula nādam̐ḍu mari tappu lĕnni sesinānu
kakkasiṁchide valabu garivaḍadā
(||||)
kŏsari māḍāḍi padim̐ gŏṁguvaṭṭi tīsugŏni
yĕsam̐gi navvam̐gavaddā yĕmmĕlāḍevu
susaramugāga padi sūḍigĕṁta rāguṁḍinā
pisigide manasainām̐ bippigaṭṭidā
(||||)
kūḍeḍi śhrīveṁkaḍeśhu gŏbbunanum̐ gāgiliṁchi
yīḍai yiṭṭe vuṁḍavaddā yela mīrevu
voḍa kalamelmaṁgavu vūragādam̐ ḍuṁḍinānu
vāḍugŏṁṭe vayasu kāvaramĕchchadā