సముఖా అవధారు సర్వేశ రాఘవేంద్ర
(॥పల్లవి॥)
సముఖా అవధారు సర్వేశ రాఘవేంద్ర
అమరులు వా రివో చిత్తావధానా
(॥॥)
రాముఁడు గొలువున్నాఁడు రాజులాల కొలువుఁడు
వామదేవ సేవించు వసిష్ఠకను
సామజముల వారవో జవనాశ్వముల వార
మీమీ పౌఁజులతో నిరు మేలా నిలువరో
(॥॥)
భరత గొడుగు వట్టు బాగాలిమ్ము శత్రుఘ్న
సరుస లక్ష్మణుఁడ వింజాము రిడుము
సొరిది నిలుచుండుడు సుగ్రీవాంగదులాల
వెరపుతో విభీషణ విన్నపాలు సేయవో
(॥॥)
వానరులాల మొక్కుడు వాయుజ పాదము లొత్తు
నానా దేశాధీశులాల కానుక లిండు
వూని శ్రీ వేంకటాదిపైఁ బొంచి సీతాసమేతుఁ డై
శ్రీ నిధియై వరా లిచ్చీ చేకొనరో ప్రజలు
(||pallavi||)
samukhā avadhāru sarveśha rāghaveṁdra
amarulu vā rivo sittāvadhānā
(||||)
rāmum̐ḍu gŏluvunnām̐ḍu rājulāla kŏluvum̐ḍu
vāmadeva seviṁchu vasiṣhṭhaganu
sāmajamula vāravo javanāśhvamula vāra
mīmī paum̐julado niru melā niluvaro
(||||)
bharada gŏḍugu vaṭṭu bāgālimmu śhatrughna
sarusa lakṣhmaṇum̐ḍa viṁjāmu riḍumu
sŏridi nilusuṁḍuḍu sugrīvāṁgadulāla
vĕrabudo vibhīṣhaṇa vinnabālu seyavo
(||||)
vānarulāla mŏkkuḍu vāyuja pādamu lŏttu
nānā deśhādhīśhulāla kānuga liṁḍu
vūni śhrī veṁkaḍādibaim̐ bŏṁchi sīdāsamedum̐ ḍai
śhrī nidhiyai varā lichchī segŏnaro prajalu