సంతోసించుకొనుటే చాలదా సారెసారెకు
(॥పల్లవి॥)
సంతోసించుకొనుటే చాలదా సారెసారెకు
చింతించి తలచుకొనే సిగ్గరికానికి
(॥॥)
చూపునఁదప్పక నీవు చూచినదే చాలదా
పూఁపు దెలిసినయట్టి పురుషునికి
కాఁపురాలు నీవు తారుకాణించవలెనా
యేపున నీగుణమెల్లా నెఱిఁగినవానికి
(॥॥)
నలువున కెలవుల నవ్వినదే చాలదా
చెలరేఁగి వాసిగలచెలువునికి
మలసి యేతువులెత్తి మాటలాడవలెనా
వలచి నిన్నుఁ బాయక వసమైనవానికి
(॥॥)
మునుకొని చెతులెత్తి మొక్కినదే చాలదా
నిను నింతసేసినట్టినేరుపరికి
పెనఁగవలెనా ప్రియానఁ గాఁగిట నీతో
యెనసిన శ్రీ వేంకటేశ్వరునికి
(||pallavi||)
saṁtosiṁchugŏnuḍe sāladā sārĕsārĕgu
siṁtiṁchi talasugŏne siggarigānigi
(||||)
sūbunam̐dappaga nīvu sūsinade sāladā
pūm̐pu dĕlisinayaṭṭi puruṣhunigi
kām̐purālu nīvu tārugāṇiṁchavalĕnā
yebuna nīguṇamĕllā nĕṟim̐ginavānigi
(||||)
naluvuna kĕlavula navvinade sāladā
sĕlarem̐gi vāsigalasĕluvunigi
malasi yeduvulĕtti māḍalāḍavalĕnā
valasi ninnum̐ bāyaga vasamainavānigi
(||||)
munugŏni sĕdulĕtti mŏkkinade sāladā
ninu niṁtasesinaṭṭinerubarigi
pĕnam̐gavalĕnā priyānam̐ gām̐giḍa nīdo
yĕnasina śhrī veṁkaḍeśhvarunigi