సంతోసించుకొందుఁగాక సతినై నేను
(॥పల్లవి॥)
సంతోసించుకొందుఁగాక సతినై నేను
వింతలుగా మరి విన్నవించేటిదేఁటిది
(॥సంతో॥)
యెందరు సతులుండినా యేలేటివాండవు నీవు
పొందేటివేడుకలభోగము నీది
ముందే నేర్పులకెల్లా మూలపుగుణము నీది
విందుల నింక నేము విన్నవించేదేఁటిది
(॥సంతో॥)
వారివారిపై పెరిఁగి వలపించుకొంటివి
గారవించనేరిచినకరుణ నీది
కోరికెరిఁగి లాలించుకొనేది నీకీరితి
చేరి నీకు విన్నపము సేసే దిఁక నేటికి
(॥సంతో॥)
యిచ్చ యెరిఁగికల సేఇంపులు నీచతురత
మచ్చికరతులలోని మహిమ నీది
హెచ్చినశ్రీవేంకటేశ యే నలమేలుమంగను
విచ్చనవిడి నీకు విన్నవించేదేఁటిది
(||pallavi||)
saṁtosiṁchugŏṁdum̐gāga sadinai nenu
viṁtalugā mari vinnaviṁcheḍidem̐ṭidi
(||saṁto||)
yĕṁdaru saduluṁḍinā yeleḍivāṁḍavu nīvu
pŏṁdeḍiveḍugalabhogamu nīdi
muṁde nerbulagĕllā mūlabuguṇamu nīdi
viṁdula niṁka nemu vinnaviṁchedem̐ṭidi
(||saṁto||)
vārivāribai pĕrim̐gi valabiṁchugŏṁṭivi
gāraviṁchanerisinagaruṇa nīdi
korigĕrim̐gi lāliṁchugŏnedi nīgīridi
seri nīgu vinnabamu sese dim̐ka neḍigi
(||saṁto||)
yichcha yĕrim̐gigala seiṁpulu nīsadurada
machchigaradulaloni mahima nīdi
hĕchchinaśhrīveṁkaḍeśha ye nalamelumaṁganu
vichchanaviḍi nīgu vinnaviṁchedem̐ṭidi