Samtosimche amdu kitte savadinaide nemi

సంతోసించే అందు కిట్టె సవతినైతే నేమి
Language

(॥పల్లవి॥)
సంతోసించే అందు కిట్టె సవతినైతే నేమి
చింతలేక చెప్పవయ్యా సిగ్గువడ నేఁటికి

(॥సంతో॥)
ఆసలు సే సేవు నీవు ఆపె నీకుఁ జుట్టమా
సేసలు వెట్టితివా చేతుల కొద్ది
పోసరించి యన్నిటాను పొంతనాలు గూడెనా
మోసపోక చెప్పవయ్యా మూసి దాఁచనేఁటికి

(॥సంతో॥)
వలపులు చల్లేవు వావులు గలసెనా
లలిఁ బోఁక ముడిచిరా లలనలెల్లా
కలిమి మెరసి నేఁడు కంత నడపించితివా
వెలయఁగఁ జెప్పవయ్యా వెరవఁగ నేఁటికి

(॥సంతో॥)
సుదతిఁ గూడితి విట్టె సోబానఁ బాడించితివా
పొదలుచు మోవితేనె బువ్వా లంటెనా
ఇదివో శ్రీ వేంకటేశ యేలితివి నన్ను నిట్టె
పొది గాకెఁ జెప్పవయ్యా బొంక నిఁక నేఁటికి

(||pallavi||)
saṁtosiṁche aṁdu kiṭṭĕ savadinaide nemi
siṁtalega sĕppavayyā sigguvaḍa nem̐ṭigi

(||saṁto||)
āsalu se sevu nīvu ābĕ nīgum̐ juṭṭamā
sesalu vĕṭṭidivā sedula kŏddi
posariṁchi yanniḍānu pŏṁtanālu gūḍĕnā
mosaboga sĕppavayyā mūsi dām̐sanem̐ṭigi

(||saṁto||)
valabulu sallevu vāvulu galasĕnā
lalim̐ bom̐ka muḍisirā lalanalĕllā
kalimi mĕrasi nem̐ḍu kaṁta naḍabiṁchidivā
vĕlayam̐gam̐ jĕppavayyā vĕravam̐ga nem̐ṭigi

(||saṁto||)
sudadim̐ gūḍidi viṭṭĕ sobānam̐ bāḍiṁchidivā
pŏdalusu movidenĕ buvvā laṁṭĕnā
idivo śhrī veṁkaḍeśha yelidivi nannu niṭṭĕ
pŏdi gāgĕm̐ jĕppavayyā bŏṁka nim̐ka nem̐ṭigi