సంతోషించితిమి నిన్ను చల్లఁగాఁ బెండ్లాడితివి
(॥పల్లవి॥)
సంతోషించితిమి నిన్ను చల్లఁగాఁ బెండ్లాడితివి
యింతటివాఁడ వైతివి యేమనేము నిన్నును
(॥సంతో॥)
వొఱపైనజాణఁడవు వొక్కఁడవే యింతటికి
గుఱి నీ వలపులైతే కోటానంగోటి
పఱపుపైఁ జాచితేను పదారువేలు దేవుళ్ళు
యెఱఁగము నీమహిమ లేమనేము నిన్నును
(॥సంతో॥)
వొలసితే నొకతెను వురమెక్కించుకొందువు
పిలిచి వొకతె నెత్తిఁబెట్టుకొందువు
తలుపు దెఱచితేను దండనెల్లా గొల్లెతలే
యిల నిన్ను గెలువలే మేమనేము నిన్నును
(॥సంతో॥)
గొందిఁ బవ్వళించితేనే గోవింరాజవు నీవు
కందున నిలుచుంటే శ్రీవేంకటపతివి
అందుకొంటేనే యిద్దరంగనలు పాదాలొద్ద
యిందరిలోమమ్మేలితి వేమనేము నిన్నును
(||pallavi||)
saṁtoṣhiṁchidimi ninnu sallam̐gām̐ bĕṁḍlāḍidivi
yiṁtaḍivām̐ḍa vaidivi yemanemu ninnunu
(||saṁto||)
vŏṟabainajāṇam̐ḍavu vŏkkam̐ḍave yiṁtaḍigi
guṟi nī valabulaide koḍānaṁgoḍi
paṟabubaim̐ jāsidenu padāruvelu devuḽḽu
yĕṟam̐gamu nīmahima lemanemu ninnunu
(||saṁto||)
vŏlaside nŏgadĕnu vuramĕkkiṁchugŏṁduvu
pilisi vŏgadĕ nĕttim̐bĕṭṭugŏṁduvu
talubu dĕṟasidenu daṁḍanĕllā gŏllĕdale
yila ninnu gĕluvale memanemu ninnunu
(||saṁto||)
gŏṁdim̐ bavvaḽiṁchidene goviṁrājavu nīvu
kaṁduna nilusuṁṭe śhrīveṁkaḍabadivi
aṁdugŏṁṭene yiddaraṁganalu pādālŏdda
yiṁdarilomammelidi vemanemu ninnunu