Samtosamulaaya maagu sari mimmiddarim joosi

సంతోసములాయ మాకు సరి మిమ్మిద్దరిఁ జూచి
Language

(॥పల్లవి॥)
సంతోసములాయ మాకు సరి మిమ్మిద్దరిఁ జూచి
వింత వింత నేరుపుల వెలయవే చెలియా

(॥సంతో॥)
వదలక నీ విభుఁడు వదకు వచ్చెఁగదవే
యెదురెదురే చూచితి విందాఁకాను
కొదదీర మాఁటపలుకులు నీతో నాడెఁగదే
కదలక యిందుకే యాఁకరుకొంటానుంట్టివి

(॥సంతో॥)
చనవిచ్చి యప్పటిని సరసములాడెఁగదె
యెనయఁగఁ గోరితి విందాఁకాను
కనుఁగాని నిన్నుఁ గూడి కాఁపురము సేసెఁగదే
జునుగుచు సగినాలే చూచుకొంటానుంటివి

(॥సంతో॥)
చక్కఁగా నీ కాఁగిటికి సతమాయఁగదవే
ఇక్కువఁ గాచుకుండితి విందాఁకాను
నిక్కి శ్రీవేంకటేశుఁడు నిన్ను నేలెఁగదవే
చొక్కి యలమేల్ మంగపు మొక్కుకొంటానుంటివి

(||pallavi||)
saṁtosamulāya māgu sari mimmiddarim̐ jūsi
viṁta viṁta nerubula vĕlayave sĕliyā

(||saṁto||)
vadalaga nī vibhum̐ḍu vadagu vachchĕm̐gadave
yĕdurĕdure sūsidi viṁdām̐kānu
kŏdadīra mām̐ṭabalugulu nīdo nāḍĕm̐gade
kadalaga yiṁduge yām̐karugŏṁṭānuṁṭṭivi

(||saṁto||)
sanavichchi yappaḍini sarasamulāḍĕm̐gadĕ
yĕnayam̐gam̐ goridi viṁdām̐kānu
kanum̐gāni ninnum̐ gūḍi kām̐puramu sesĕm̐gade
junugusu sagināle sūsugŏṁṭānuṁṭivi

(||saṁto||)
sakkam̐gā nī kām̐giḍigi sadamāyam̐gadave
ikkuvam̐ gāsuguṁḍidi viṁdām̐kānu
nikki śhrīveṁkaḍeśhum̐ḍu ninnu nelĕm̐gadave
sŏkki yalamel maṁgabu mŏkkugŏṁṭānuṁṭivi