Samtosamaaya mee saridalu soosi maagu

సంతోసమాయ మీ సరితలు చూచి మాకు
Language

(॥పల్లవి॥)
సంతోసమాయ మీ సరితలు చూచి మాకు
యెంతకెంత మీ వేడుక లేమి చేప్పేమయ్యా

(॥సంతో॥)
కన్నులనే సన్న సేసి కలువలఁ గొని వేసీ
కన్నెవలపులు నీకు గాదెఁ బోసీని
చన్నుల నీమేను రాసి సారెకు గందము వూసీ
యెన్నటిపొందులో కాని యేమి చెప్పిమయ్యా

(॥సంతో॥)
సొలపులనె చొక్కి చూచినదె నిక్కినిక్కి
కలికి నీతో నవ్వీఁ గడుసొంపెక్కి
చెలరేఁగి నీకు మొక్కి చేతులఁ జెక్కులు నొక్కీ
యెలమి మీసరసము లేమి చెప్పిమయ్యా

(॥సంతో॥)
పరగఁ గాఁగిటఁ బట్టి పరవశములఁ దొట్టి
తరుణి నీపాదము పాదాన మెట్టీని
యిరవై శ్రీవేంకటేశ యిట్టే నన్ను నేలితివి
యెరవుల మీలోచేఁత లేమి చెప్పిమయ్యా

(||pallavi||)
saṁtosamāya mī saridalu sūsi māgu
yĕṁtagĕṁta mī veḍuga lemi seppemayyā

(||saṁto||)
kannulane sanna sesi kaluvalam̐ gŏni vesī
kannĕvalabulu nīgu gādĕm̐ bosīni
sannula nīmenu rāsi sārĕgu gaṁdamu vūsī
yĕnnaḍibŏṁdulo kāni yemi sĕppimayyā

(||saṁto||)
sŏlabulanĕ sŏkki sūsinadĕ nikkinikki
kaligi nīdo navvīm̐ gaḍusŏṁpĕkki
sĕlarem̐gi nīgu mŏkki sedulam̐ jĕkkulu nŏkkī
yĕlami mīsarasamu lemi sĕppimayyā

(||saṁto||)
paragam̐ gām̐giḍam̐ baṭṭi paravaśhamulam̐ dŏṭṭi
taruṇi nībādamu pādāna mĕṭṭīni
yiravai śhrīveṁkaḍeśha yiṭṭe nannu nelidivi
yĕravula mīlosem̐ta lemi sĕppimayyā