Samtosaana numdaro sadulaala

సంతోసాన నుండరో సతులాల
Language

(॥పల్లవి॥)
సంతోసాన నుండరో సతులాల
మంతనాన నాతఁడే మన్నించీఁ గాని

(॥॥)
చెలులను దూఱవద్దు చిత్తము గలఁగవద్దు
మలసి యాతఁడే నన్ను మన్నించీఁ గాని
బలిమి సేయఁగ వద్దు పదరి పెనఁగ వద్దు
నెలకొన్న కాఁపురము నెరవేర్చీఁ గాని

(॥॥)
సన్నలు సేయఁగ వద్దు చలము సాదించవద్దు
యిన్నిటా నాతఁడే నన్ను నేలీఁగాని
విన్నఁ బోవ వద్దు మరి వెలవెలఁ బారవద్దు
పన్నుకొన్న వేడుకలు పచరించీఁ గాని

(॥॥)
కొంగువట్టి తియ్యవద్దు కొసరి సొలయవద్దు
యింగిత మెఱిఁగి తానే యెనసీఁ గాని
అంగపు శ్రీ వేంకటేశుఁ డలమేల్మంగను నేను
చెంగటఁ గూడె నింకాఁ జిత్తగించీఁ గాని.

(||pallavi||)
saṁtosāna nuṁḍaro sadulāla
maṁtanāna nādam̐ḍe manniṁchīm̐ gāni

(||||)
sĕlulanu dūṟavaddu sittamu galam̐gavaddu
malasi yādam̐ḍe nannu manniṁchīm̐ gāni
balimi seyam̐ga vaddu padari pĕnam̐ga vaddu
nĕlagŏnna kām̐puramu nĕraversīm̐ gāni

(||||)
sannalu seyam̐ga vaddu salamu sādiṁchavaddu
yinniḍā nādam̐ḍe nannu nelīm̐gāni
vinnam̐ bova vaddu mari vĕlavĕlam̐ bāravaddu
pannugŏnna veḍugalu pasariṁchīm̐ gāni

(||||)
kŏṁguvaṭṭi tiyyavaddu kŏsari sŏlayavaddu
yiṁgida mĕṟim̐gi tāne yĕnasīm̐ gāni
aṁgabu śhrī veṁkaḍeśhum̐ ḍalamelmaṁganu nenu
sĕṁgaḍam̐ gūḍĕ niṁkām̐ jittagiṁchīm̐ gāni.