Samtaloni jaanavu jaajaralo vaamdavu

సంతలోని జాణవు జాజరలో వాఁడవు
Language

(॥పల్లవి॥)
సంతలోని జాణవు జాజరలో వాఁడవు
వింతలేదు నాకు నీకు విన్నపమిదయ్యా

(॥సంత॥)
గొల్ల చల్ల పుల్లన గున్నచింత చల్లన
వొల్లనె మా పొందులకు నోపుదువా
చల్లదుబ్బదుబ్బెడు సాదించితే వలపులు
తెల్లవారె మా గుట్టు తెలుసుకోవయ్యా

(॥సంత॥)
దొడ్డిగంపలప్పెఁడు తొలిపాలు చిప్పెఁడు
వొడ్డారపు మాతో పొందుకోపుదువా
జిడ్డుదేరి దుత్తెఁడు చిత్తములోని రతులు
తెడ్డెఁడేసి మోవితీపు తెలుసుకోవయ్యా

(॥సంత॥)
మందావులు కల్లలు మాకులెల్లా మొల్లలు
వొందిలి మాతోడి పొందుకోపుదువా
కందువ శ్రీ వేంకటేశ కలసితివిదే నన్ను
దిందుపడే మా నవ్వులు తెలుసుకోవయ్యా

(||pallavi||)
saṁtaloni jāṇavu jājaralo vām̐ḍavu
viṁtaledu nāgu nīgu vinnabamidayyā

(||saṁta||)
gŏlla salla pullana gunnasiṁta sallana
vŏllanĕ mā pŏṁdulagu nobuduvā
salladubbadubbĕḍu sādiṁchide valabulu
tĕllavārĕ mā guṭṭu tĕlusugovayyā

(||saṁta||)
dŏḍḍigaṁpalappĕm̐ḍu tŏlibālu sippĕm̐ḍu
vŏḍḍārabu mādo pŏṁdugobuduvā
jiḍḍuderi duttĕm̐ḍu sittamuloni radulu
tĕḍḍĕm̐ḍesi movidību tĕlusugovayyā

(||saṁta||)
maṁdāvulu kallalu māgulĕllā mŏllalu
vŏṁdili mādoḍi pŏṁdugobuduvā
kaṁduva śhrī veṁkaḍeśha kalasidivide nannu
diṁdubaḍe mā navvulu tĕlusugovayyā