Samtagoodaalavaarellaa sadamayyeraa

సంతకూటాలవారెల్లా సతమయ్యేరా
Language

(॥పల్లవి॥)
సంతకూటాలవారెల్లా సతమయ్యేరా
మంతుకెక్కిన నా మేలు మఱవకు మిఁకను

(॥సంత॥)
పంతమాడేదానఁ గాను పలుమారు నీతోను
రంతుసేయని ఇచ్చకురాలఁ గాని
బంతికూటిసతులెల్ల పనికివత్తురా నీకు
వంతుకుఁ, బెండ్లాడినటువంటివారే కాక

(॥సంత॥)
కక్కసించేదానఁ గాను కాదుకూడదని నీతో
దక్కివుండే చిత్తములోదానఁ గాని
పక్కఁ గూచున్నవారెల్లా బందుగులౌదురా నీకు
గక్న నీకు మేనరికపువారే కాక

(॥సంత॥)
వేసరించేదానఁగాను వేడుక శ్రీవేంకటేశ
ఆసతో నిన్నుఁ గూడిన ఆలఁగాని
వేసాలపొరుగువారు వేళకొదిగేరా నీకు
వాసి నింట వరుసకు వచ్చేవారే కాక

(||pallavi||)
saṁtagūḍālavārĕllā sadamayyerā
maṁtugĕkkina nā melu maṟavagu mim̐kanu

(||saṁta||)
paṁtamāḍedānam̐ gānu palumāru nīdonu
raṁtuseyani ichchagurālam̐ gāni
baṁtigūḍisadulĕlla panigivatturā nīgu
vaṁtugum̐, bĕṁḍlāḍinaḍuvaṁṭivāre kāga

(||saṁta||)
kakkasiṁchedānam̐ gānu kādugūḍadani nīdo
dakkivuṁḍe sittamulodānam̐ gāni
pakkam̐ gūsunnavārĕllā baṁdugulaudurā nīgu
gakna nīgu menarigabuvāre kāga

(||saṁta||)
vesariṁchedānam̐gānu veḍuga śhrīveṁkaḍeśha
āsado ninnum̐ gūḍina ālam̐gāni
vesālabŏruguvāru veḽagŏdigerā nīgu
vāsi niṁṭa varusagu vachchevāre kāga