Sammadoori sennumdaa jaanamda vauduvayya

సమ్మటూరి చెన్నుఁడా జాణఁడ వౌదువయ్య
Language

(॥పల్లవి॥)
సమ్మటూరి చెన్నుఁడా జాణఁడ వౌదువయ్య
పమ్మి యన్నిటాను చెల్లుబడియాయ వలపు

(॥సమ॥)
తమ్మిపువ్వుల వేసేవు తప్పకచూచితినంటా
దొమ్మిసేసేవు పాదముతొక్కితినంటా
నిమ్మపండు పిండేవు నిన్ను నే దొబ్బితినంటా
ముమ్మాటికిని ముయికి ముయ్యీయ వలపు

(॥సమ॥)
కోరి పన్నీరు చిమ్మేవు కొంగు నేఁ బట్టితినంటా
గీరేవు గోరను గిలిగించేనంటా
యేరా చన్నులు విసికే విట్టె కొప్పంటితినంటా
మారుకొ వొకటి కినుమడి మాయ వలపు

(॥సమ॥)
కప్పురము చల్లేవు కాఁగిట బిగించితినంటా
గుప్పేవు పరిమళాలు కూడితినంటా
యిప్పుడే శ్రీవేంకటాద్రి నేలితివి మెచ్చేనంటా
చప్పుడు మోవితేనెల జంటాయ వలపు

(||pallavi||)
sammaḍūri sĕnnum̐ḍā jāṇam̐ḍa vauduvayya
pammi yanniḍānu sĕllubaḍiyāya valabu

(||sama||)
tammibuvvula vesevu tappagasūsidinaṁṭā
dŏmmisesevu pādamudŏkkidinaṁṭā
nimmabaṁḍu piṁḍevu ninnu ne dŏbbidinaṁṭā
mummāḍigini muyigi muyyīya valabu

(||sama||)
kori pannīru simmevu kŏṁgu nem̐ baṭṭidinaṁṭā
gīrevu goranu giligiṁchenaṁṭā
yerā sannulu visige viṭṭĕ kŏppaṁṭidinaṁṭā
mārugŏ vŏgaḍi kinumaḍi māya valabu

(||sama||)
kappuramu sallevu kām̐giḍa bigiṁchidinaṁṭā
guppevu parimaḽālu kūḍidinaṁṭā
yippuḍe śhrīveṁkaḍādri nelidivi mĕchchenaṁṭā
sappuḍu movidenĕla jaṁṭāya valabu