సమ్మతించి నా చోటికి చవిగా దొకరి బుద్ది
(॥పల్లవి॥)
సమ్మతించి నా చోటికి చవిగా దొకరి బుద్ది
నెమ్మది నాకె తలఁపు నీవె యడుగవయ్యా
(॥సమ్ము॥)
ఆకె నీవైఁ గన్నవేసె నందుకు నీ వియ్యకొంటి -
వేకచిత్తమైనచోట నెడమాఁటలా
యేకత మేమిగల్లా నిట్టె నీవు విచ్చేసి
ఆకెతో నాడుకోవయ్య అయ్యో నే మోపము
(॥సమ్ము॥)
కూడి మాడి వుండుదురు గుణములు మీ కొక్కటే
యీడ మాచేఁ బిలిపించే వింతివి నీవు
పాడిఁబంత మెఱఁగవా పడఁతిని నోరినిండా
ఆడనే పిలువవయ్య అయ్యో నేము నేరము
(॥సమ్ము॥)
నిక్కి సన్న సేసితివి నెలఁత సెలవి నవ్వె
వొక్కటైనచోట నింకా నొడఁబాట్లా
చక్కని శ్రీ వేంకటేశ సతిఁ గూడితివి యాకు
ఇక్కువ మడిచీవయ్య యీవేళ దగ్గరము
(||pallavi||)
sammadiṁchi nā soḍigi savigā dŏgari buddi
nĕmmadi nāgĕ talam̐pu nīvĕ yaḍugavayyā
(||sammu||)
āgĕ nīvaim̐ gannavesĕ naṁdugu nī viyyagŏṁṭi -
vegasittamainasoḍa nĕḍamām̐ṭalā
yegada memigallā niṭṭĕ nīvu vichchesi
āgĕdo nāḍugovayya ayyo ne mobamu
(||sammu||)
kūḍi māḍi vuṁḍuduru guṇamulu mī kŏkkaḍe
yīḍa māsem̐ bilibiṁche viṁtivi nīvu
pāḍim̐baṁta mĕṟam̐gavā paḍam̐tini noriniṁḍā
āḍane piluvavayya ayyo nemu neramu
(||sammu||)
nikki sanna sesidivi nĕlam̐ta sĕlavi navvĕ
vŏkkaḍainasoḍa niṁkā nŏḍam̐bāṭlā
sakkani śhrī veṁkaḍeśha sadim̐ gūḍidivi yāgu
ikkuva maḍisīvayya yīveḽa daggaramu