సంకెలెల్లాఁ దీరె చనవు లీడేరెను
(॥పల్లవి॥)
సంకెలెల్లాఁ దీరె చనవు లీడేరెను
వంక లొత్తకువే మాఁట వాఁటమయ్యీ సిగ్గులు
(॥సంకె॥)
నగినదాఁకా నింతే నాతీ నీనిష్టూరమెల్ల
తెగనాడి ఇంతలోనే తిట్టనేఁటికే
మొగము చూచినప్పుడే ముచ్చటలు తుదకెక్కె
పగచాటకువే నీపయ్యద జారీని
(॥సంకె॥)
దగ్గరుదాఁకా నింతే తలపోఁతలన్నియును
కగ్గి ఇందుకుఁగాను వట్టికపటాలేలే
బగ్గనఁ బలికితేనే పంతమెల్లా నీడేరె
నిగ్గులఁ బెనఁగకువే నిండీఁ జెమటలు
(॥సంకె॥)
పొందినదాఁకా నింతే పొరపొచ్చెములెల్లాను
సందుసుడి నీకేలే జంకెనలు
ముందే శ్రీవేంకటేశుఁడ మొక్కఁగానే కూడితివి
పందెములు వేయకువే వచ్చీ దోఁచీఁ బనులు
(||pallavi||)
saṁkĕlĕllām̐ dīrĕ sanavu līḍerĕnu
vaṁka lŏttaguve mām̐ṭa vām̐ṭamayyī siggulu
(||saṁkĕ||)
naginadām̐kā niṁte nādī nīniṣhṭūramĕlla
tĕganāḍi iṁtalone tiṭṭanem̐ṭige
mŏgamu sūsinappuḍe muchchaḍalu tudagĕkkĕ
pagasāḍaguve nībayyada jārīni
(||saṁkĕ||)
daggarudām̐kā niṁte talabom̐talanniyunu
kaggi iṁdugum̐gānu vaṭṭigabaḍālele
bagganam̐ baligidene paṁtamĕllā nīḍerĕ
niggulam̐ bĕnam̐gaguve niṁḍīm̐ jĕmaḍalu
(||saṁkĕ||)
pŏṁdinadām̐kā niṁte pŏrabŏchchĕmulĕllānu
saṁdusuḍi nīgele jaṁkĕnalu
muṁde śhrīveṁkaḍeśhum̐ḍa mŏkkam̐gāne kūḍidivi
paṁdĕmulu veyaguve vachchī dom̐sīm̐ banulu