Samka gudiyayu mari sharanaardiyunela

చంక గుదియయు మరి శరణార్తియునేల
Language

(॥పల్లవి॥)
చంక గుదియయు మరి శరణార్తియునేల
సంకెలేక నీపంతమె సాదించుకోరాదా

(॥చంక॥)
యేడనుండో వచ్చి నీవు యేమీ నే ననకుండా
వాడుమోము నీవు ముందే వంచవలెనా
వేడుక దొరవు నీవు వెరపు నీ కింతయేలా
యీడుగాఁ జేసినచేఁతే యీడేర్చుకోరాదా

(॥చంక॥)
సొలసి నీమేనిపచ్చి చూచి వెంగెమాడకుండా
అలయకముందే వుస్సురనవలెనా
బలవంతుఁడవు నీవు పరితాప మిఁకనేల
చెలఁగి తొల్లటిచేఁతే చెల్లించుకోరాదా

(॥చంక॥)
అరవిరై వచ్చి నీవు అదేమీ నే ననకుండా
గరిమఁ గాఁగిట నన్నుఁగలసేవు
యిరవై శ్రీవేంకటేశ యిన్నిసుద్దు లిఁకనేల
పరగ నన్నేలితివి పాయకుండరాదా

(||pallavi||)
saṁka gudiyayu mari śharaṇārdiyunela
saṁkĕlega nībaṁtamĕ sādiṁchugorādā

(||saṁka||)
yeḍanuṁḍo vachchi nīvu yemī ne nanaguṁḍā
vāḍumomu nīvu muṁde vaṁchavalĕnā
veḍuga dŏravu nīvu vĕrabu nī kiṁtayelā
yīḍugām̐ jesinasem̐te yīḍersugorādā

(||saṁka||)
sŏlasi nīmenibachchi sūsi vĕṁgĕmāḍaguṁḍā
alayagamuṁde vussuranavalĕnā
balavaṁtum̐ḍavu nīvu paridāba mim̐kanela
sĕlam̐gi tŏllaḍisem̐te sĕlliṁchugorādā

(||saṁka||)
aravirai vachchi nīvu ademī ne nanaguṁḍā
garimam̐ gām̐giḍa nannum̐galasevu
yiravai śhrīveṁkaḍeśha yinnisuddu lim̐kanela
paraga nannelidivi pāyaguṁḍarādā